BJP: మోదీ క్యాబినెట్‌లో అవకాశం రానివాళ్లంతా అసమర్థులేనా.. RTVతో డా.కే లక్ష్మణ్ సెన్సేషనల్ ఇంటర్వ్యూ! మోదీ క్యాబినెట్‌లో చోటు దక్కని వారంతా అసమర్థులేనా? బీజేపీ రాజ్యాంగం మార్చి రిజర్వేషన్లు తొలగించబోతుందా? అయోధ్యలో బీజేపీ ఓటమికి అదే కారణమా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నది నిజమేనా? RTVతో సంచలన విషయాలు బయటపెట్టిన లక్ష్మణ్! By srinivas 12 Jul 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Dr Laxman: బీజేపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.కే లక్ష్మణ్ ఆర్టీవీకి సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. నరేంద్రమోదీ హ్యాట్రిక్ సాధించడం దేశానికి గొప్ప శుభసూచకమన్నారు. అలాగే క్యాబినేట్ లో చోటు దక్కకపోవడంపై మాట్లాడుతూ.. పార్టీ ఆదేశాలను శిరోధార్యంగా భావించి కష్టపడి పనిచేయడమే తనకు తెలుసని చెప్పారు. సామాన్య కార్యకర్తగా మొదలుపెట్టి ఈ స్థాయికి చేరినందుకు చాలా సంతృప్తిగానే ఉందన్నారు. మోదీ తనపై అపారమైన నమ్మకం ఉంచారని చెప్పారు. అయితే మోదీ క్యాబినేట్ లో చోటు దక్కకపోవడం అసమర్థత కాదని, ఏ ప్రభుత్వంలోనైనా అందరికీ అవకాశాలు రావని చెప్పారు. మోదీ హయాంలో పనిచేయడం గొప్ప అవకాశంగా భావిస్తానంటూ సంతోషం వ్యక్తం చేశారు. బీజేపీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారనే విషయంపై కూడా ఓపెన్ అయ్యారు. కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంటుంది.. అలాగే బీజేపీ రాజ్యంగం మార్చాలనే వాదనలపై మాట్లాడుతూ.. అవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారేశారు. కర్ణాటకలో ఒక నాయకుడు తొందరపాటులో ఆ మాట అన్నందుకు దానిని హైలెట్ చేశారని, అంతకుమించి బీజేపీకి అలాంటి ఆలోచనే లేదన్నారు. ఇక పదేళ్లలో ఒక్కశాతం కూడా రిజర్వేషన్ తొలగించలేదని, పలు చోట్ల ఎస్సీ, ఎస్టీలతోపాటు మహిళలకు 33 శాతం రిజర్వేషన్ పెంచామని గుర్తు చేశారు. జమ్మూ కశ్మీర్ లోనూ 370 రద్దు తర్వాత ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. ఇక దేశంలో ఎన్నికల్లో ఓడిపోయిన వారు కూడా సంబరాలు చేసుకోవడం ఆశ్చర్యంగా ఉందంటూ కాంగ్రెస్ పై సెటైర్స్ వేశారు. ఇక పార్టీ నియమాలకు విరుద్ధంగా మాట్లాడిన వారికి ఈసారి బీజేపీ టికెట్ ఇవ్వలేదని చెప్పారు. అయోధ్యలోని ఫైజాబాద్ అభ్యర్థి ఓటమిపై స్పందిస్తూ.. ఫేక్ వీడియోలతో బీజేపీపై విషం చిమ్మారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను దుర్వినియోగం చేసిందన్నారు. అమిత్ షా ప్రసంగాలను తప్పదారి పట్టించారన్నారని, దీనికి భవిష్యత్తులో కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించుకుంటుందని చెప్పారు. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమిపై స్పందిస్తూ.. అందరూ కలిసికట్టుకుగా పనిచేసిన విజయం సాధించారన్నారు. తెలంగాణ సెంటిమెంట్ పేరుతో బీఆర్ఎస్ లబ్ది పొందిందని, కానీ ప్రజలు కేసీఆర్ పార్టీని నామరూపాల్లేకుండా చేస్తారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రెండు రాష్ట్రాలు ఎప్పటికైనా అన్నదమ్ములుగా ఉండాలని బీజేపీ భావిస్తుందన్నారు. కానీ మిగతా పార్టీలన్నీ విద్వేశాలు నింపి ప్రజలను రెచ్చగొడుతున్నారన్నారంటూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. పూర్తి సమాచారం కోసం కింది వీడియోను చూడండి. #bjp #interview-with-rtv #dr-k-laxman మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి