Tmili Sai Over Speculations: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం స్టేజ్ మీదకు వచ్చిన తిమిళిసై అందరిని పలకరించుకుంటూ వెంకయ్యనాయుడు పక్కన కూర్చున అమిత్ షాకు కూడా నమస్కారం చేసిన ముందుకు వెళ్ళారు. అయితే అమిత్ షా ఆమెను వెనక్కు పిలిచి ఏదో సీరియస్‌గా మాట్లాడారు. దానికి తమిళిసై సమాధానం చెబుతున్నా అమిత్ షా వినిపించుకోలేదు. పక్కనే ఉన్ వెంకయ్యనాయుడు వారిద్దరినే చూస్తూ అలా ఉండిపోయారు. ఈ మొత్తం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అమిత్ షా...తమిళిసైకు ఏదో వార్నింగ్ ఇచ్చారని చెప్పుకున్నారు. దీని మీద డీఎంకే పార్టీ కూడా స్పందించింది. పబ్లిక్ మీటింగ్‌లో ఓ మహిళతో అలా ప్రవర్తించడం సరికాదంటూ వ్యాఖ్యలు చేసింది. దాని తర్వాత ఈ విషయం నెమ్మదిగా పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంతో ఇప్పుడు అమిత్‌షాతో మాట్లాడ్డంపై తమిళిసై వివరణ ఇచ్చారు. తన ఎక్స్ ఖాతాలో దానికి సంబంధించి పోస్ట్ పెట్టారు.
ఎన్నికలు అయ్యాక తాను కేంద్ర హోం మంత్రి అమిత్ షాను అదే మొదటిసారి కలిసానని...అందుకే ఆయన తనను ఎన్నికల తర్వాత ఫాలోఅప్, ఎదుర్కొన్న సవాళ్లు గురించి అడిగి తెలుసుకోవడానికి పిలిచారని చెప్పారు. ఆయన అడిగిన వాటిని తాను వివరిస్తున్నానని.. సమయం తక్కువగా ఉన్నందున.. రాజకీయ, నియోజకవర్గ పనులు చూసుకోవాలని సలహా ఇచ్చారని చెప్పుకోచ్చారు. కానీ ఈ మొత్తం విషయాన్ని పక్కదోవ పట్టించారని తమిళి సై ఆవేదన వ్యక్తం చేశారు. ఏదో జరిగినట్లుగా ఊహాగానాలు సృష్టించారని ఆమె పోస్ట్‌లో రాసుకొచ్చారు. మరోవైపు ఎన్నికల ఫలితాలు తర్వాత తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై-తమిళిసై వర్గాల మధ్య విమర్శలు.. ప్రతి విమర్శలు చోటుచేసుకున్నాయి. మీడియాకు ఎక్కి రచ్చ రచ్చ చేసుకున్నారు. ఈ సందర్భంగా తమిళిసైకి క్లాస్ పీకినట్లుగా వార్తలు వినిపించాయి.
Also Read:NEET: ఈనెల 23న వారికి మళ్ళీ నీట్ పరీక్ష..జూన్ 30న ఫలితాలు