Chhattisgarh News: ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ నేత దారుణ హత్య.. కాల్చిచంపిన మావోయిస్టులు

ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దారుణం చోటుచేసుకుంది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన మొహ్లా-మాన్‌పూర్‌ జిల్లా చౌకీ పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకుడుపై మావోయిస్టులు దాడి చేసి దారుణంగా కాల్చి చంప్పారు.

Chhattisgarh News: ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ నేత దారుణ హత్య.. కాల్చిచంపిన మావోయిస్టులు
New Update

ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దారుణం చోటుచేసుకుంది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన మొహ్లా-మాన్‌పూర్‌ జిల్లా చౌకీ పట్టణంలో బీజేపీ నేతపై మావోయిస్టులు దాడి చేసి దారుణంగా కాల్చి చంప్పారు. వివరాల్లోకి వెళ్తే.. చత్తీస్గఢ్లో బీజేపీ నాయకుడు దారుణ హత్యకు గురయ్యారు. రాజనందగావ్ జిల్లా సర్ఖెడా గ్రామంలో శుక్రవారం రాత్రి 8:30 గంటలకు బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి బిర్జు తారామ్ ఇంట్లోకి వెళ్లి.. మావోయిస్టులు మూడు రౌండుల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బిర్జు తారామ్ అక్కడికక్కడే మరణించారు.

ఇది కూడా చదవండి: చండికా అలంకారంలో గజ్వేల్ మహంకాళి అమ్మవారు… పోటెత్తిన భక్తజనం

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ 

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మావోయిస్టులు ఈ దుశ్చర్యకు పాల్పడడంతో.. బీజేపీ నేతలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే.. ఈ దారుణానికి పాల్పడింది మావోయిస్టులా..? ఇంకా ఏవరైనా..? అనేది ఇప్పుడే చెప్పలేమని జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ రత్నసింగ్‌ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

వ్యతిరేకంగా ఉద్యమాలు

కాగా.. ఛత్తీస్గఢ్లో మొహ్లా-మాన్‌పూర్‌తో పాటు మరో 19 ఇతర నియోజకవర్గాల్లో వచ్చే నెల 7న తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ నేత ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ బీజేపీ అధ్యక్షుడు అరుణ్‌ సావో స్పందిస్తూ.. ఈ హత్య టార్గెట్‌ మర్డర్‌ అని ఆయన ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలను ఈ దాడితో అణిచివేయాలని చూస్తే అది జరగదని పని అరుణ్‌ సావో తెలిపారు. ఈ ఘటనలో తుపాకీ పట్టుకున్న 8 నుంచి 10 మంది మావోయిస్టులు ఒకరి తర్వాత ఒకరు బీజేపీ నాయకుడిని కాల్చిచంపినట్లు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ప్రాంతంలో బిర్జు తారామ్ హిందుత్వ నాయకుడు. ఈ ప్రాంతంలో మిషనరీలు, హిందూత్వ సంస్థల మధ్య చాలా కాలంగా వివాదం కనసాగుతున్నాయి. అయితే.. ఏడాది క్రితం ఇక్కడ హిందూ  దేవుళ్ల విగ్రహాలను కొందరు సంఘవిద్రోహశక్తులు ధ్వంసం చేశారు. దీన్ని మావోయిస్టుల ఘటనగా పోలీసులు వెల్లడించారు. బిర్జూ తారమ్ చాలా కాలంగా వీటన్నింటికి వ్యతిరేకంగా ఉద్యమించాడు. మత మార్పిడిని అరికట్టాలని అతను అనేకసార్లు మోహ్లా-మన్‌పూర్‌లో పెద్ద ఉద్యమాలు చేశాడు. దీని కారణంగా కూడా మతపరమైన కోణం నుంచి ఈ విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

#shot-dead #maoists #bjp-leader-birju-taram #chhattisgarh
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి