పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ భద్రతపై ప్రశ్నిస్తే పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం దేశ పార్లమెంటరి వ్యవస్థకే మాయని మచ్చగా పేర్కొన్నారు. హైదరాబాద్ లోని ప్రజా భవన్ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోనూ తమ దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని పరిష్కరిస్తామన్నారు.
ఈ మేరకు పార్లమెంట్ లో మొన్న ఆగంతకులు దూకి సభ్యులపై టియర్ గ్యాస్ విడిచిన సంఘటనపై మాట్లాడితే మంత్రులను సస్పెండ్ చేయడం బాధకరమన్నారు. పార్లమెంట్ భద్రతపై ప్రశ్నస్తే 77 మంది పార్లమెంట్ సభ్యులను సస్పెండ్ చేయడం దేశ పార్లమెంటరి వ్యవస్థకే మచ్చగా పేర్కొన్నారు. అలాగే కొంతమంది నాయకులు తనీషా, నియంత లాగా పరిపాలిస్తున్నారని, అందుకే విద్వేషాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యం అమలుకావాలనే రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని గుర్తు చేశారు. భారతదేశ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నారన్న మంత్రి ప్రభుత్వంపై ప్రశ్నిస్తే బీజేపీ అనుబంధ సంస్థలు సిబిఐ,ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి : Scholarship: ఎంబీఏ చేసే వారికి ఆ యూనివర్సిటీ బంపరాఫర్.. ఏకంగా రూ.10 లక్షల స్కాలర్ షిప్!
మేము తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి చూడలేదు. ప్రభుత్వం 4 కాళ్ళు నియంత్రుత్వం మీదనే నడవాలని చూస్తుంది. ఇండియా అనే పదాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దేశ వ్యాప్తంగా అన్ని పార్టీలు ఒక్కటై నిరసిస్తున్నారు. బీజేపీ కార్యకర్తలను రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. అందుకే ఎంపీలను సస్పెండ్ చేసింది. మేము దేశ భక్తులం అని చెప్పుకునే బీజేపీ ఎంపిలు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక తెలంగాణపై వ్యతిరేకంగా మాట్లాడిన, పార్లమెంట్ మీద దాడి జరిగిన, సస్పెండ్ చేసినా బీజేపీ ఎంపీలు ఎందుకు నోరు తెరవరని ప్రశ్నించారు.
ఇక 13వ తేదీ జరిగిన దాడిపై ఇంతవరకు ముఖ్య నాయకులు ఎందుకు స్పందించలేదన్న ప్రభాకర్.. గతంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తమంటే తమకు అవకాశం ఎందుకు ఇవ్వలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక తెలంగాణ గురించి మాట్లాడుతూ.. ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందనే విషయంపై అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తామని చెప్పారు. ఇక కడియం శ్రీహరి మాట్లాడిన తీరు ఏమీ బోగోలేదని, కేటీఆర్, హరీష్ రావు చెప్పించారని ఆరోపించారు. ప్రభుత్వం మారింది. దానికి అగుగుణంగా వ్యవహరించాలి. ప్రజలు మార్పు కోరుకున్నారు. మీరు చేసింది బంగారు తెలంగాణ అయితే ప్రజావాణి నుండి వేల పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి? అని బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. చివరగా ఆటో కార్మికులకు అండగా ఉంటామన్న మంత్రి.. వారి సమస్యలు పరిష్కరిస్తామని, 15 రోజుల్లో రివ్యూ చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు.