BJP Manifesto: అధికార పార్టీ బీజేపీ ‘సంకల్ప పత్రం’ పేరుతో లోక్ సభ ఎన్నికల ( Lok Sabha Election 2024) మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ మేరకు ‘మోడీ గ్యారెంటీ-2047 కల్లా వికసిత భారత్’ లక్ష్యంతో 14 అంశాలతో కూడిన మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి ప్రధాని మోడీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు.
సామాజిక న్యాయం, జాతీయవాద అంశాలు..
ఈ మేరకు దేశ అభివృద్ధి, సామాజిక న్యాయం, సాంస్కృతిక, జాతీయవాద అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు. ఇక హై స్పీడ్ రైళ్లు, బుల్లెట్ రైలు కారిడార్ల లాంటి అనేక మౌలిక సదుపాయాలను కూడా ఇందులో ప్రస్తావించారు. జాతీయ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వగా.. దేశ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడితే ధీటుగా సమాధానమిస్తామనే హెచ్చరించారు. 2019లో విడుదల చేసిన సంకల్ప్ పత్రంలో పేర్కొన్న హామీల్లో ఎన్ని అమలయ్యాయో కూడా ఇందులో తెలియజేశారు. సమాజంలో అట్టడుగున ఉన్న యువకులు, మహిళలు, పేదలు, రైతుల అభ్యున్నతికి తీసుకోబోయే చర్యలను కూడా ఈ మేనిఫెస్టోలో ప్రకటించారు.