Jithender Reddy: ఎంపీ టికెట్ కోసం ట్విట్టర్‌లో యుద్ధం చేస్తున్న జితేందర్ రెడ్డి!

బీజేపీలో టికెట్ల పంచాయతీ మొదలైంది. మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ కోసం డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. తాజాగా జితేందర్ రెడ్డి తనకే టికెట్ వస్తుందని.. తనకు తిరుమలేశుడు తోడున్నాడంటూ ట్వీట్ చేశారు. ఆయనకు బీజేపీ టికెట్ ఇస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

New Update
Jithender Reddy: ఎంపీ టికెట్ కోసం ట్విట్టర్‌లో యుద్ధం చేస్తున్న జితేందర్ రెడ్డి!

Jithender Reddy Tweet: బీజేపీలో మహబూబ్‌నగర్ టికెట్ మధ్య పోటీ రసవత్తరంగా జరుగుతోంది. తనకే టికెట్ వస్తుందని డీకే అరుణ.. లేదు తనకు టికెట్ కన్ఫామ్ అయిందని మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి ప్రకటనలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తొలి జాబితాలో మహబూబ్‌నగర్ ఎంపీ టికెట్ ను బీజేపీ హైకమాండ్ ప్రకటించకుండా సస్పెన్స్ లో పెట్టింది. అయితే.. వీరిలో ఎవరికి ఎంపీ టికెట్ వరిస్తుందో అనే ఉత్కంఠ మహబూబ్‌నగర్ బీజేపీ కార్యకర్తల్లో నెలకొంది.

ALSO READ: ఇద్దరు ఎంపీలను ప్రకటించిన కేసీఆర్

నో టాక్స్.. ఓన్లీ ట్వీట్స్..

లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీజేపీ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చేసే ట్వీట్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. తాజాగా మరో ట్వీట్ చేశారు జితేందర్ రెడ్డి. ఎంపీ టికెట్‌ తనదే అని.. తనకు తిరుమలేశుడు తోడున్నాడంటూ ట్విట్టర్ (X) లో పోస్ట్ చేశారు. ఆ పోస్టుకు ప్రధాని మోడీ, అమిత్‌ షా, జేపీ నడ్డా, బీఎల్‌ సంతోష్‌, కిషన్‌రెడ్డి, డాక్టర్‌ లక్ష్మణ్‌ను జితేందర్‌ రెడ్డి ట్యాగ్‌ చేశారు. దీంతో ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. డీకే అరుణకు కాకుండా మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డికి బీజేపీ అధిష్టానం టికెట్ ఇస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.

మొదటి సారి ఇలా..

గురువారం నాడు ఢిల్లీలో బీజేపీ ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రానికి చెందిన పలువురు కీలక నేతలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి (Jithender Reddy) ట్విట్టర్‌ వేదికగా ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ట్విట్టర్‌ లో.. వాట్ టు డు, వాట్ నాట్ టు డు అంటూ కామెంట్‌ పెట్టి.. ఎన్నికల ముందు ఆలోచిస్తున్నట్లు ఫన్నీ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో చిన్నపిల్లాడు బట్టలు లేకుండా అటు ఇటు తిరుగుతూ థింక్ చేస్తూ ఉంటాడు. బీజేపీ రాజకీయాలపైనే జితేందర్‌ రెడ్డి ఇలా సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారా..? అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Advertisment
తాజా కథనాలు