Bilkis Bano Rape Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.. కానీ: రఘునందన్ రావు బిల్కిస్ బానో రేప్ కేసులో 11 మంది దోషులకు క్షమాభిక్షను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఈ తీర్పుపై రాహుల్ గాంధీ, కవిత, కేటీఆర్ ప్రధాని మోదీని కించపరుస్తూ మాట్లాడారంటూ విమర్శించారు. By B Aravind 09 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో 11 మంది దోషులను ఆగస్టు 15, 2022లో గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయగా.. నిన్న (సోమవారం) సుప్రీంకోర్టు వారి క్షమాభిక్షను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. అంతేకాదు ప్రభుత్వానికి క్షమాభిక్ష పెట్టే అధికారం లేదని.. గుజరాత్ ప్రభుత్వానిది అధికార దర్వినియోగం అంటూ గట్టిగా చివాట్లు పెట్టింది. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్కీస్ బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ' Also Read: మాల్దీవుల వివాదం.. ఆ రెండు షేర్లకు రెక్కలు.. మీ దగ్గర ఉన్నాయా? రామమందిరం తీర్పును ఎందుకు స్వాగతించలేదు ఈ తీర్పుపై రాహుల్ గాంధీ, కవిత, కేటీఆర్ ప్రధాని మోదీని కించపరుస్తూ మాట్లాడారు. రామమందిర నిర్మాణం మీద జడ్జిమెంట్ ఇచ్చింది కూడా సుప్రీంకోర్టు కాదా. రామమందిర నిర్మాణం తీర్పును వీళ్లు ఎందుకు స్వాగతించలేదు. అసలు ఈ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు. 1985లో శాభానో అనే ముస్లీం మహిళకు భరణం కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పును రాహుల్ గాంధీ నాన్న రాజీవ్ గాంధీ పక్కన పెట్టారు. ఏడేళ్లు ఆ మహిళ పోరాటం చేస్తే సుప్రీంకోర్టు ఆమెకు అనూకూలంగా తీర్పునిచ్చింది. ఐదుగురు జడ్జిలు కలిసి ఇచ్చిన జడ్జిమెంట్‌ను రాజీవ్ గాంధీ పక్కన పెట్టించారు. Also Read: నాలుగేళ్ల కుమారుడి దారుణ హత్య.. ఒళ్లు గగురు పొడిచేలా బెంగళూరు సీఈవో క్రైమ్ కథ! బీఆర్‌ఎస్‌తో కలిసే ప్రసక్తే లేదు ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలా మాట్లాడటం సెక్యులరిజమా ?. పార్లమెంట్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్ల కోసం మాత్రమే మాట్లాడుతున్నారు తప్ప వారి మీద ప్రేమ కాదు. జ్ఞానవ్యాపి మసీద్ కేసును సైతం స్వాగతించాలి. బీజేపీ అన్ని కోర్ట్‌ల తీర్పులను స్వాగతిస్తుంది. ఆదిలాబాద్‌లో దళిత బిడ్డ టేకులపల్లి లక్ష్మి మీద రేప్ జరిగి హత్య చేసినప్పుడు కవిత, కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదు ?. అప్పుడు తెరవని నోర్లు ఇప్పుడెందుకు లేస్తున్నాయి ?. రాహుల్ గాంధీ మాట్లాడిన కాసేపటికే కేటీఆర్, కవిత మాట్లాడతారు. మరి ఎవరు ఒక్కటి అనేది తెలియడం లేదా. బీఆర్‌ఎస్‌తో కలిసి బీజేపీ వెళ్ళే ప్రసక్తే లేదు. నాణేనికి రెండు మొహాల కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఉన్నాయి తప్పా బీజేపీ బీఆర్‌ఎస్ ఎప్పటికీ ఒక్కటి కాదంటూ' మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మాట్లాడారు. ఏంటీ బిల్కిస్ బానో కేసు.. 2002లో గోద్రా రైలు దహనకాండ తర్వాత గుజరాత్‌లో అల్లర్లు జరిగాయి. ఈ ఘటనలో బిల్కిస్ బానోపై అత్యాచారం జరిగింది. ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని దుండగులు హత్య చేశారు. ఆ సమయంలో ఐదు నెలల గర్భిణిగా ఉన్న బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో 11 మంది నిందితులకు సీబీఐ ప్రత్యేక కోర్టు 2008 జనవరి 21న జీవిత ఖైదు విధించింది. #supreme-court #bilkis-bano-case #bjp-raghunandan-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి