MLC Kavitha: మహిళలు ఉన్నత స్థానానికి చేరుకోవడం బీజేపీ ఓర్వలేకపోతోంది: కవిత

మహిళల పట్ల బీజేపీ తీరుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. మహిళలపై దాడి చేయడం ఆపాలన్నారు. వ్యక్తిత్వహరణ చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆమె మండిపడ్డారు. మహిళల గురించి తప్పుడు వ్యాఖ్యాలు చేస్తూ ఆ పార్టీ నేతలు అవహేళన చేయడం మానుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

New Update
MLC Kavitha: మహిళలు ఉన్నత స్థానానికి చేరుకోవడం బీజేపీ ఓర్వలేకపోతోంది: కవిత

MLC Kavitha: మహిళల పట్ల బీజేపీ తీరుపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. మహిళలపై దాడి చేయడం ఆపాలన్నారు. వ్యక్తిత్వహరణ చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆమె మండిపడ్డారు. మహిళల గురించి తప్పుడు వ్యాఖ్యాలు చేస్తూ ఆ పార్టీ నేతలు అవహేళన చేయడం మానుకోవాలని ఆమె స్పష్టం చేశారు.

ట్విట్టర్ వేదిగా తెలంగాణ బీజేపీ చేసిన ఓ ట్వీట్ పై ఆమె ఇలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కాలం చెల్లిన మూస పద్ధతిలో మహిళల పై అవహేళన చేయడం తగదని ఆమె పేర్కొన్నారు. ఇక మహిళలు ఉన్నత స్థానానికి చేరుకోవడం బీజేపీ ఓర్వలేక పోతుందా అని కవిత ప్రశ్నించారు. ఆ పార్టీ.. మహిళల హక్కుల గురించి మాట్లాడుతున్న వారి గొంతు నొక్కడానికి ప్రయత్నాలు చేయడం హాస్యాస్పదంగా  ఉందన్నారు కవిత. ఇప్పటికైనా ఆ పార్టీ ఇతరులపై నిందలు వేయడం మానుకొని పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించడానికి కృషి చేయాలని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.


ఇక రెండ్రోజుల క్రితం మహిళా రిజర్వేషన్ల విషయంలో కవిత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన ట్వీట్ కు ఇలానే ఘాటుగా రిప్లే ఇచ్చారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తామని రెండుసార్లు హామీలు ఇచ్చిన బీజేపీ మహిళలను మోసం చేసిందన్నారు.పార్లమెంట్ లో భారీ మెజార్టీ ఉన్నా మహిళా బిల్లును ఎందుకు ఆమోదించడం లేదని ఆమె నిలదీశారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.


Also Read: కొడంగల్‌ నుంచే పోటీ చేస్తా.. కాస్కో.. రేవంత్‌ రెడ్డి సవాల్‌

Advertisment
Advertisment
తాజా కథనాలు