Telangana : ఫ్లోర్ లీడర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలకు బీజేపీ

బీజేఎల్పీ లీడర్ ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది పార్టీ. ఫ్లోర్ లీడర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలకు బీజేపీ హాజరవనుంది. పార్టీ తరుఫున ఎవరు ప్రతినిధ్యం వహిస్తారన్నదాని మీద క్లారిటీ లేదు. మరోవైపు ఈ పదవిని ఎమ్మెల్యేలు వెంకటరమణా రెడ్డి, ఏలేటి మహేశ్వర రెడ్డి ఆశిస్తున్నారు.

New Update
Telangana : ఫ్లోర్ లీడర్ లేకుండానే బడ్జెట్ సమావేశాలకు బీజేపీ

No Floor Leader in BJP : BJLP లీడర్ ఎంపికపై మల్ల గుల్లాలు పడుతోంది కమలం పార్టీ(BJP Party). ఇప్పటివరకు నియమించక పోవడంతో ఎమ్మెల్యేల్లో గందరగోళం ఏర్పడింది. ఈరోజు తెలంగాణ(Telangana) అసెంబ్లీ మొదలవుతుండడంతో ఎవరు ప్రతినిధ్యం వహిస్తారు అన్నది తెలియడం లేదు. మరోవైపు నలుగురు ఎమ్మెల్యేలు డిల్లీ(Delhi) లో ఉన్నట్లు సమాచారం. వారు ఈ టైమ్‌లో అక్కడికి ఎందుకు వెళ్ళారన్నది కూడా తెలియడం లేదు. ఇక ఫ్లోర్ లీడర్ ఎంపిక హైకమాండ్ దేనని అంటున్నారు రాష్ట్ర నేతలు . గెలిచిన 8మంది ఎమ్మెల్యేల్లో రాజాసింగ్ కి కాకుండా ఎవరికి ఇస్తే బాగుంటుందనేదానిపై బీజేపీ కసరత్తు చేస్తోంది.

Also Read : Andhra Pradesh : టీడీపీలోకి వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు?

వారిద్దరిలో ఎవరికి ఇస్తారో..

ఫ్లోర్ లీడర్ పదవిని ఆశిస్తున్న ఎమ్మెల్యేల్లో వెంకటరమణా రెడ్డి, ఏలేటి మహేశ్వర రెడ్డి ఉన్నారు. వీరిద్దరిలో ఎవరికో ఒకరికి ఇవ్వాలని మిగా నేతలు కూడా అంటున్నట్టు సమాచారం. ఇవాల్టి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు(Telangana Budget Meetings) అవుతున్నాయి. అందులో భాగంగా జరిగే బీఏసీ మీటింగ్ కు వెంకటరమణారెడ్డి హాజరు కాబోతున్నారు. కేసీఆర్‌ను ఓడించిన వెంకట రమణారెడ్డి ఫ్లోర్ లీడర్ పదవి తనకే వస్తుందని చెబుతున్నట్టు తెలుస్తోంది. అయితే పార్టీ మాత్రం ఇప్పటి వరకు ఈ విషయం మీద స్పందించడం లేదు. మరోవైపు ఫ్లోర్ లీడర్ పదవి కోసం పోటీపడే క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య సమనవ్యం లోపించిందని చెబుతున్నారు. దీంతో ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు ప్రవర్తిస్తున్నారని అంటున్నారు. అయితే గత సమావేశాల మాదిరిగానే హై కమాండ్ సూచన మేరకు..అంశాన్ని బట్టి ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.

కిషన్ రెడ్డి మీద గుర్రుగా ఉన్న ఎమ్మెల్యేలు...

ఇక రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy) కూడా ఇదేమీ పట్టించుకోవడం లేదు. దీని మీదనా పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. అసెంబ్లీలో మాట్లాడవలసిన అంశాల గురించి కిషన్ రెడ్డి దిశానిర్దేశం చెయయలేదు. కనీసం ఎమ్మెల్యేలతో మాట్లాడలేదు కూడా. ఈ విషయం మీద పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని సమాచారం.

Advertisment
తాజా కథనాలు