అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు
రజాకార్ల రైతాంగ సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తుందని సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. సిద్దిపేటలోని శివమ్స్ గార్డెన్‌లో నిర్వహించిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అమరవీరుల సంస్మరణ సభలో హాజరై మాట్లాడారు. సెప్టెంబర్ 10 నుంచి 17 వరుకు చాకలి ఐలమ్మ వర్ధంతి. తెలంగాణ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటంలో మొట్టమొదటి అమరుడు దొడ్డి కొమురయ్య అని అన్నారు. సీపీఎం, సీపీఐ లలో నెహ్రూ ప్రభుత్వం వల్లే చీలికలు జరిగాయన్నారు.
హిందూ, ముస్లింల మధ్యలో చిచ్చు
హిందూ, ముస్లింల మధ్యలో చిచ్చు పెట్టడానికి బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుందన్నారు. ముస్లిం, మైనార్టీలను పడగొట్టడమే బీజేపీ పార్టీ అని అంటున్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాలను, పీడిత ప్రజల పోరాటాలను ముస్లిం హిందువులు మధ్య పోరాటంగా బీజేపీ నాయకులు చెప్పడం సిగ్గుచేటు అన్నారు. బీజేపీ సిద్ధాంత గ్రంథాలలో దేశం బాగుండాలంటే ముస్లింలు క్రిస్టియన్లను, కమ్యూనిస్టులను, చంపేయాలని ఉందా..? అని ప్రశ్నించారు. ఇందు కోసమే బీజేపీ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్ఆర్సిపీ వంటి, ప్రాంతీయ పార్టీలతో పొత్తు కలుపుకుని.. బీజేపీ పార్టీనీ అనగదొక్కడము కోసమే ప్రాంతీయ పార్టీలతో పొత్తు కలుపుకున్నామన్నారు. మునుగోడు ఎలక్షన్‌లో బీజేపీ పార్టీని ఓడగొట్టడం కోసమే టీఆర్ఎస్ పార్టీతో పొత్తు కలుపుకున్నామన్నారు. కమ్యూనిస్టులతోనే మునుగోడు ఎలక్షన్‌లో బీజేపీ ఓడిపోయిందని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలో బీజేపీ పార్టీని అనగదొక్కడమే తమ లక్ష్యం అన్నారు. సీట్ల కోసం పోత్తుల కోసం కమ్యూనిస్టు పార్టీ ఉండదని భవిష్యత్తులో బీజేపీ వ్యతిరేక శక్తులతో సీపీఎం పార్టీ కలిసి పనిచేస్తుందని అన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ ఒకటే అన్న ప్రచారంతో బీఆర్ఎస్‌కు మైనార్టీ వర్గాలు దూరమయ్యే పరిస్థితి ఉంటుందని, ముస్లింల ఓట్లు పడకపోతే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందన్నారు.
ఈడీ నోటీసులు రావడంలో ఆంతర్యం ఏమిటో..?
కవితకు మళ్ళీ ఈడీ నోటీసులు వచ్చిన సంగతిని గుర్తు చేశారు. ఈడీ నోటీసులు మళ్లీ రావడం వెనుక ఆంతర్యం ఏమిటో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు చెప్పాలనీ నిలదీశారు. రాబోయే భవిష్యత్తు ఎన్నికలలో సీపీఐ పార్టీని కలుపుకొని పోతామని అవసరమైన విధంగా పోత్తులు కలుపుకుంటామన్నారు. తెలంగాణ వచ్చినక దళితులకు మూడెకరల భూమి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉద్యోగాలు ఇస్తాను హామీ ఇచ్చి హామీలు నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతుబంధు ఇస్తానని అక్కడక్కడ శాంపిల్ చూయించి దళితులను ఆగం చేస్తున్నారని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తానని ఇప్పటివరకు ఇవ్వలేదని అన్నారు. భూమి గురించి ఏ ప్రభుత్వం వచ్చినా పేదలకు భూములు పంచడంలో విఫలమైందని కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వస్తే భూములు పేదలకు పంచుతామని అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు బంధులు ఇస్తామని ఏ బందులు ఇవ్వడంలో బీఆర్ఎస్ పూర్తిగా సఫలం కాలేకపోయారని అన్నారు.
Also Read: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్