Birds Suicide: ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకుంటున్న పక్షులు.. సేమ్ టైమ్, సేమ్ ప్లేస్!

పక్షులు సామూహిక ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటన ప్రకృతి ప్రేమికులను ఆందోళనకు గురి చేస్తోంది. అసోంలోని జటింగా గ్రామంలో సెప్టెంబర్ లో స్థానిక పక్షులతోపాటు వలస పక్షులు ఆత్మహత్య చేసుకోవడం మిస్టరిగా మారిందని పరిశోధకులు వెల్లడించారు. రహస్య శక్తి ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు.

New Update
Birds Suicide: ఆ గ్రామంలో ఆత్మహత్య చేసుకుంటున్న పక్షులు.. సేమ్ టైమ్, సేమ్ ప్లేస్!

Jatinga Bird Suicide Mystery: పక్షులు 'సామూహిక ఆత్మహత్య'కు పాల్పడుతున్న ఘటన ప్రకృతి ప్రేమికులను ఆందోళనకు గురి చేస్తోంది. అయితే అవి ప్రతి సంవత్సరం ఒకే నెలలో, ఒకే ప్రాంతంలో సైసైడ్ కు పాల్పడుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ మేరకు అసోం (Assam) రాష్ట్రంలోని డిమా హసో జిల్లా కొండల్లో ఉండే జటింగా గ్రామాన్ని పక్షుల ఆత్మహత్య పాయింట్ గా కనుగొన్నారు. అంతేకాదు ఇక్కడికి వచ్చే స్థానిక పక్షులే కాదు వలస పక్షులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నాయని తేల్చి చెప్పారు.

భిన్నమైన పద్ధతి..
ఈ మేరకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ప్రారంభంలో పక్షులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. దీంతో జటింగ (Jatinga) గ్రామం వెలుగులోకి వచ్చింది. అయితే సాధారణంగా మానవుల్లో ఉండే ఈ ఈ ధోరణి పక్షుల్లో కనిపించడం బాధకరమన్నారు. మనుషులు జీవితంలో ఫెయిల్ అయినప్పుడు ఆత్మహత్యలకు పాల్పడతారు. ఎత్తైన భవనాలు లేదా లోతైన గుంటలు వంటి మానవులకు ఆత్మహత్య పాయింట్లుగా ఉంటాయి. కానీ పక్షుల విషయంలో ఇది భిన్నంగా ఉంటుంది. పక్షులు వేగంగా ఎగురుతున్నప్పుడు, ఉద్దేశపూర్వకంగా భవనాలు లేదా ఎత్తైన చెట్లను ఢీకొని తక్షణమే చనిపోతాయి. ఇలా సెప్టెంబరులో వేలాది పక్షులకు జరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు.

రాత్రి 7 నుంచి10 మధ్య..
అంతేకాదు రాత్రి 7నుంచి 10 గంటల మధ్య మాత్రమే ఇలా చేస్తున్నాయన్నారు. 'సాధారణ వాతావరణంలో పక్షులు పగటిపూట బయటకు వస్తాయి. రాత్రికి గూడుకు తిరిగి వస్తాయి. అలాంటప్పుడు అకస్మాత్తుగా నెల రోజుల పాటు చీకట్లు కమ్ముకుంటే వేలల్లో గూడు నుంచి బయటకు వచ్చి ఢీకొని చనిపోవడానికి కారణం ఏమిటి? 40 రకాల వలస పక్షులు ఈ ఆత్మహత్యాయత్నంలో పాల్గొంటాయి. ఇక్కడి నుంచి వెళ్లిన తర్వాత విదేశీ వలస పక్షులు తిరిగి రావు. రాత్రి పూట ఈ లోయలోకి ప్రవేశించడంపై నిషేధం ఉంది. ఏది ఏమైనప్పటికీ, సహజ కారణాల వల్ల జటింగా గ్రామం తొమ్మిది నెలల పాటు బయటి ప్రపంచం నుంచి ఒంటరిగా మిగిలిపోయింది' అన్నారు.

రహస్య శక్తి..
దీని వెనుక ఏదో రహస్య శక్తి ఉందని గ్రామస్తులు భావిస్తున్నారు. ఈ సమయంలో గాలులకు అతీంద్రియ శక్తి ఉందని, ఇది పక్షులను ఇలా చేస్తుందని ఒక నమ్మకం. ఈ సమయంలో మానవ జనాభా బయటకు రావడం ప్రమాదకరమని వారు నమ్ముతారు. అందువల్ల సెప్టెంబర్-అక్టోబర్ సమయంలో ఈ ప్రదేశం సాయంత్రం పూట పూర్తిగా ఎడారిగా మారుతుంది.
ఈ పక్షుల ఆత్మహత్యల పరంపర 1910 నుండి కొనసాగుతుండగా 1957లో ప్రపంచానికి తెలిసింది. పక్షి శాస్త్రవేత్త EP జీ ఏదో పని మీద జటింగా వచ్చారు. ఈ సమయంలో ఆయన స్వయంగా ఈ ఘటనను చూశారు. 'ది వైల్డ్ లైఫ్ ఆఫ్ ఇండియా' పుస్తకంలో ఈ సంఘటనను ప్రస్తావించారు. 'ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ దీనికి కారణం అర్థం కాలేదు. పక్షులు ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నుండి అక్టోబరు 31 వరకు పొగమంచు, తేమ ఉన్నప్పుడు ఇలా చేస్తాయి. విచిత్రమైన విషయం ఏమిటంటే చంద్రకాంతి లేనప్పుడు ఇది చీకటి రాత్రులలో మాత్రమే జరుగుతుంది' అని ఆయన పేర్కొన్నారు.

ఎందరో శాస్త్రవేత్తలు పరిశోధనలు..
భారతదేశంతోపాటు విదేశాలకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేశారు. అటవీ శాఖ అధికారులు కూడా దీనికి గల కారణాన్ని కనుగొనడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పటివరకు పక్షుల ఆత్మహత్యకు కారణం లేదా దానిని అరికట్టడానికి ఎటువంటి మార్గం కనుగొనబడలేదు. భవనాలను ఢీకొన్న తర్వాత గాయపడిన పక్షులకు చికిత్స, ఆహారం ఇవ్వడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. పక్షులు ఆహారం తినడానికి నిరాకరించాయి. శరీరాలు చికిత్సకు కూడా స్పందించలేదని స్పష్టం చేశారు.

Also Read: ఇదే అత్యంత భయానక పక్షి.. మనుషులను చూస్తే అంతే!

Advertisment
తాజా కథనాలు