Bird Flu : కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం..తమిళనాడులో హై అలర్ట్..! కేరళలోని అలప్పుజా జిల్లాలోని రెండు గ్రామాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. దీంతో కోయింబత్తూరులో హై అలర్ట్ విధించారు. కేరళ సరిహద్దులోని 12 చెక్ పోస్టుల వద్ద నిఘా కట్టుదిట్టం చేసింది . అలప్పుజా జిల్లాతో కొయింబత్తూరు జిల్లా సరిహద్దు కలిగి ఉండటంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు . By Bhoomi 21 Apr 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Bird Flu In Kerala : బర్డ్ ఫ్లూ(Bird Flu) మళ్లీ కలకలం రేపుతోంది. కేరళ(Kerala) లోని అలప్పుజాలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అయినట్లు అధికారులు చెబుతున్నారు.దీంతో తమిళనాడులోని కోయింబత్తూరు లో హైఅలర్ట్ విధించారు. కేరళ సరిహద్దులోని 12 చెక్ పోస్టుల వద్ద నిఘా కట్టుదిట్టం చేసింది పరిపాలనా యంత్రంగం. అలప్పుజా జిల్లాతో కొయింబత్తూరు జిల్లా సరిహద్దు కలిగి ఉండటంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. కేరళ నుంచి బర్డ్ ఫ్లూ తమ జిల్లాలోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. ప్రజలు అంతగా భయపడాల్సిన అవసరం లేదని కోయింబత్తూరు పరిపాలన యంత్రాంగం తెలిపింది. కేరళ ప్రభుత్వం అలప్పుజాలోని బాతుల్లో H1n1 రకం బర్డ్ ఫ్లూను గుర్తించింది. ఈ బాతుల బ్లడ్ శాంపిల్స్(Blood Samples) ను టెస్టుల కోసం భోపాల్ లోని ‘నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్’కు పంపించినట్లు తెలిపింది. అటు కేరళ నుంచి కోయింబత్తూరులోకి ప్రవేశించే వాహనాలను పూర్తిగా శానిటైజ్ చేస్తున్నామని జిల్లా అధికారులు చెబుతున్నారు. వలయార్, వెలంతవాలమ్, మీనాక్షిపురం, గోపాలపురం చెక్‌పోస్టుల దగ్గర నిఘాను పెంచినట్లు తెలిపారు. పౌల్ట్రీ రవాణాకు సంబంధించిన వాహనాలను కేరళ నుంచి జిల్లాలోకి అనుమతి లేదన్నారు. ఇక జిల్లాలోని 1252 పౌల్ట్రీలను చాలా దగ్గరి నుంచి పర్యవేక్షిస్తున్నామని..ఇక్కడి కోడి మాంసం తినడం వల్ల ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేసింది. కోడి మాంసం, కోడిగుడ్లను తినకూడదని హెచ్చరించింది. చికెన్‌ను గానీ, గుడ్లను గానీ బాగా ఉడికించి తినాలని జిల్లా యంత్రాంగం సూచించింది. ఏవియన్ ఇన్ఫ్లుఎంజా (H5N1) అంటే ఏమిటి? ప్రధానంగా పక్షులను ప్రభావితం చేసే అత్యంత అంటువ్యాధి వైరల్ ఇన్ఫెక్షన్. బర్డ్ ఫ్లూ ప్రజలలో చాలా అరుదు, కానీ ఇది తీవ్రమైన అనారోగ్యానికి కారణమవుతుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - వ్యాధి కోడి, బాతు, పిట్ట, హంస, టర్కీ వంటి పక్షులను ప్రభావితం చేస్తుంది. -వ్యాధి సోకిన పక్షులతో సన్నిహితంగా ఉండే వ్యక్తులు, పక్షి సంరక్షకులు, దేశీయ పక్షులతో పరిచయం ఉన్న పిల్లలు, గృహిణులు, పశువైద్యులు ఇతర సంబంధిత సిబ్బంది నివారణ చర్యలు తీసుకోవాలి. బర్డ్ ఫ్లూ లక్షణాలు ఏమిటి? -తీవ్రమైన శరీర నొప్పి, -జ్వరం -దగ్గు -శ్వాస ఆడకపోవుట -జలుబు చేస్తోంది -శ్లేష్మం లో రక్తం ఇది కూడా చదవండి: మా ఆయన ధోనితోనే ఉండాలి.. యంగ్ ప్లేయర్ భార్య ఎమోషనల్ పోస్ట్! #kerala #bird-flu #coimbatore #alappuza మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి