కేరళలో ఓ వాహనాదారుడికి రాష్ట్ర మోటార్ విభాగం షాక్ ఇచ్చింది. సుమారు 155 సార్లు ట్రాఫిర్ నిబంధనలను ఉల్లంఘించిన ఆ వ్యక్తికి ఏకంగా రూ.86 వేలు ఫైన్ వేసింది. అంతే కాదు అతడి డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా రద్దు చేసింది. ఇక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ 25 ఏళ్ల యువకుడు తన బైక్‌పై వెళ్తూ పలుమార్లు రహదారి నిబంధనలు ఉల్లంఘించాడు. అర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ ఆధారిత కెమెరాలో అతడు నిబంధలు ఉల్లంఘించిన దృశ్యాలు రికార్డు అయ్యాయి. హెల్మెట్ లేకుండా వెళ్లడమే కాకుండా.. ఆ సమయంలో.. ఎవరు ఏం చేస్తారు లే అనే భావనతో ఏఐ కెమెరా ముందు కొంచెం విచిత్రంగా ప్రవర్తించాడని.. అధికారులు తెలిపారు.
Also Read: ఆ 90 నిమిషాల్లో ఏం జరిగింది.. మళ్లీ అభ్యర్థులను మార్చిన బీజేపీ
ఇలా అతడు చాలాసార్లు నిబంధనలు ఉల్లంఘించడం వల్ల జరిమానా చెల్లించాలంటూ అధికారులు అనేకసార్లు మెయిళ్లు పంపారు. అయినా కూడా అతడు పట్టించుకోకుండా లైట్ తీసుకున్నాడు. దీంతో అధికారులే స్వయంగా అతడి ఇంటికి వచ్చి ఏకంగా రూ.86 వేలు జరిమాన చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు. ఇది చూసిన ఆ వాహనాదారుడు ఒక్కసారిగా కంగుతిన్నాడు. అంతమొత్తం చెల్లించలేనట్లు అధికారుల ముందు మొరపెట్టుకున్నాడు. తన బైక్ అమ్మినా కూడా ఆ మొత్తం ఫైన్ కట్టలేనంటూ వాపోయాడు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే అనేక చోట్ల కొంతమంది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తుంటారు. సిగ్నల్ పడకముందే రయ్యున దూసుకోవడం, రాంగ్ రూట్‌లో రావడం వంటివి చేస్తుంటారు. వీటివల్ల వాళ్ల ప్రమాదాలే కాకుండా ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడుతున్నాయని వాహనాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఖతార్ లో నేవీ అధికారులకు మరణశిక్ష.. అప్పీల్ చేసిన భారత్!