Heatwave: తెరుచుకున్న పాఠశాలలు.. ఎండకు సొమ్మసిల్లిపోయిన విద్యార్థులు బీహార్‌లో వేసవి సెలవులు ముగియడంతో ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే షేక్‌పూరా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో ఎండ వేడికి తట్టుకోలేక 16 మంది విద్యార్థులు సొమ్మసిల్లిపోయారు. టీచర్లు వారిని ఆసుపత్రికి తరలించారు. By B Aravind 29 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఓవైపు వేసవి కాలం ముగిసిపోతున్నప్పటికీ.. పలు ప్రాంతాల్లో మాత్రం ఎండలు దంచికొడుతున్నాయి. ఆ క్రమంలోనే తాజాగా బీహార్‌లో పాఠశాలలు ప్రారంభం కాగా.. ఎండ వేడి తట్టుకోలేక విద్యార్థులు అల్లాడిపోయారు. కొంతమంది విద్యార్థులు సొమ్మసిల్లిపడిపోవడం కలకలం రేపింది. దీంతో విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. వేసవి సెలవులు ముగియడంతో షేక్‌పూరా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల బుధవారం తెరుచుకుంది. అక్కడ ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలు దాటడంతో విద్యార్థులు ఎండను తట్టుకోలేకపోయారు. Also Read: రేపు కేరళను తాకనున్న రుతుపవనాలు.. తెలంగాణ, ఏపీకి ఎప్పుడంటే దాదాపు 16 మంది బాలికలు స్పృహతప్పి పడిపోయారు. టీచర్లు వారికి సపర్యలు చేసిన తర్వాత.. ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఎండల తీవ్రత ఉన్నప్పటికీ కూడా ఇప్పుడే బీహార్‌లో పాఠశాలలు తెరవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. స్థానికులు పాఠశాలలకు వెళ్లి టీచర్లతో వాగ్వాదానికి దిగుతున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై విపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. ఎండలు మండిపోతున్నప్పటికీ పాఠశాలలు తెరవడం ఏంటని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. #WATCH | Bihar: Several students fainted due to heatwave conditions at a school in Sheikhpura. The students were later admitted to a hospital. pic.twitter.com/Mv9Eg3taCJ — ANI (@ANI) May 29, 2024 Also Read: కార్లు కడిగితే రూ.2000 ఫైన్ .. సర్కార్ షాకింగ్ నిర్ణయం #telugu-news #bihar-news #heatwave #bihar-schools మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి