Bihar Man Dies 108 Degrees Fever : ఎన్నడూ లేని విధంగా దేశంలో ఎండలు (Heat) మండుతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు (Temperatures) నమోదు కావడంతో దేశ రాజధాని లో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత పది రోజులుగా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటేశాయని అధికారులు వివరించారు. దీనికి తోడు పక్క రాష్ట్రం రాజస్థాన్ నుంచి వస్తున్న వేడిగాలుల (Hot Air) ప్రభావంతో జనాలు మరింత ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
వడదెబ్బతో జనం విలవిలలాడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ (Delhi) లో వడదెబ్బకు గురైన బిహార్‌కు చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తి.. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందతూ బుధవారం మృతిచెందాడు. అస్వస్థతతో సోమవారం రాత్రి ఆస్పత్రిలో చేరిన అతడికి జ్వరం 108 డిగ్రీలు (108 Degrees Fever) దాటిందని వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటన ఢిల్లీలో ఎండల తీవ్రతకు అద్దం పడుతోంది. బాధితుడికి వైద్యం చేసిన డాక్టర్ మాట్లాడుతూ.. ఆ వ్యక్తి ఫ్యాన్ లేదా కూలర్ సౌకర్యం లేని గదిలో నివసిస్తున్నాడని, తీవ్ర జ్వరంతో ఉన్నాడని తెలిపారు. శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీల సెల్సియస్ ను దాటిందని వివరించారు.
ఇది మానవుడి సాధారణం ఉష్ణోగ్రత (97.5) డిగ్రీల కంటే దాదాపు 10 డిగ్రీలు ఎక్కువ. ఈ వేసవిలో ఢిల్లీలో వడదెబ్బ కారణంగా నమోదైన తొలి మరణం ఇదే. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలకు తోడు నీటి ఎద్దడి, అధిక విద్యుత్ డిమాండ్‌తో ఈ వేసవి ఢిల్లీ వాసులకు పీడకలగా మారింది. బుధవారం ఢిల్లీ శివారులోని ముంగేష్‌పూర్ వాతావరణ కేంద్రంలో ఉష్ణోగ్రత 52.9 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యింది. ఇదే ఇప్పటి వరకూ దేశంలోనే నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రత.
Also read: పది పరీక్షల మీద పది సార్లు దండయాత్ర..పాసవ్వడంతో బ్యాండు మేళంతో ఊరేగింపు!