Bigg Boss 7 Promo: నన్ను కొడితే.. తాట తీస్తా..! ఎవరికి రంగు పడింది..?

కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ 'రంగు పడుద్ది రాజా' టాస్క్(Task) ఇస్తాడు. ప్రోమో చూస్తుంటే హౌస్ లో అందరు చాలా ఫైర్ మీద ఉన్నట్లు కనిపిస్తుంది. గొడవలు కూడా బాగానే జరిగినట్టు కనిపిస్తుంది. ఈ టాస్క్ సంచాలకులుగా ప్రియాంక వ్యవహరిస్తోంది. 

New Update
Bigg Boss 7  Promo: నన్ను కొడితే.. తాట తీస్తా..! ఎవరికి  రంగు పడింది..?

Bigg Boss 7 Promo: బిగ్ బాస్ సీజన్ 7 మొదటి కెప్టెన్సీ టాస్క్ చాలా ఆసక్తికరంగా జరుగుతుంది. జంటలుగా విడిపోయిన సభ్యుల్లో ఒకరు వారి లెటర్ ను త్యాగం చేయగా చివరికి  ఫైనల్ కెప్టెన్సీ కంటెండర్స్  గా  ప్రశాంత్, సందీప్, గౌతమ్, తేజ ఈ టాస్క్ లో ఆడుతున్నారు. ఇక ఈ కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ 'రంగు పడుద్ది రాజా' టాస్క్(Task) ఇస్తాడు. ప్రోమో చూస్తుంటే హౌస్ లో అందరు చాలా ఫైర్ మీద ఉన్నట్లు కనిపిస్తుంది. గొడవలు కూడా బాగానే జరిగినట్టు కనిపిస్తుంది. ఈ టాస్క్ సంచాలకులుగా ప్రియాంక వ్యవహరిస్తోంది.

రంగు పడుద్ది రాజా

బిగ్ ఇంట్లో మొదటి కెప్టెన్(captain) కోసం ఆడుతున్న ఆట. ఈ టాస్క్ లో కంటెండర్స్ (Contender) వారి అపోనెంట్ టీషర్ట్(T-shirt) పై రంగు పూయాల్సి ఉంటుంది. అలా ఎవరి టీషర్ట్ పై ఎక్కువ రంగు కనిపిస్తుందో వారు రేస్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుంది. ఇలా 4 లెవెల్స్ లో ఈ టాస్క్ జరగనుంది.

నన్ను కొడితే.. తాట తీస్తా.. 

ఇక టాస్క్ మధ్యలో సందీప్, ప్రశాంత్ కు గొడవ జరుగుతుంది. ప్రశాంత్ మొహం పై కొడుతున్నాడని సందీప్ ఆరోపణలు చేస్తాడు. దాంతో శివాజీ(Shivaji) జనాలు చూస్తున్నారు అని ఒక మాట విసురుతాడు. వెంటనే అమర్(Amar) జనాలు చూస్తే ఈ వారం నేనే బయటకు వెళ్తానులే అంటాడు. కోపంతో ఊగిపోతున్న సందీప్ ప్రశాంత్ పై గట్టిగా అరుస్తాడు.. నన్ను కొడితే ఊరుకోను వాడి తాట తీస్తా అంటూ ఫైర్ అవుతాడు.

ప్రియాంక పై అరిచేసిన సందీప్ 

మాస్టర్ మీరు సిర్కిల్ నుంచి బయటకు వెళ్తున్నారు అని వార్న్ చేస్తుంది.. దాంతో సందీప్(Sandeep) కోపంతో అవతలి వాళ్ళు తోస్తున్నారు.. నా మొహం కొడుతున్నారు నన్ను కొడితే నేను కొడతాను అంటూ ప్రియాంక పై గట్టి గట్టిగా అరుస్తాడు.

గౌతమ్ VS ప్రశాంత్

ప్రోమో ఆధారంగా సందీప్, తేజ ఫస్ట్ రెండు రౌండ్స్ ఎలిమినేట్ అవ్వగా.. చివరి రౌండ్ లో గౌతమ్, ప్రశాంత్ మిగిలారు.. వీరిద్దరి మధ్య భీభత్సమైన పోటీ జరుగుతుంది. ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి గట్టిగానే ఆడతారు. రూల్స్ విరుద్దంగా ఆడుతారు దాంతో ప్రియాంక వాళ్ళిద్దరికీ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. చివరికి బిగ్ బాస్ విజేతలు ఎవరో ప్రకటించండి అంటాడు.. అప్పుడు అమర్ దేవుడున్నాడు అని అరుస్తాడు దీన్ని బట్టి ప్రశాంత్ ఓడిపోయినట్లు తెలుస్తుంది.

అసలు ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.. రోజు రోజుకు బిగ్ బాస్ ఆటను మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండేలా ముందుకు తీసుకెళ్తున్నాడు.

Also Read: Bigg Boss 7: కిందపడి ఏడ్చేసిన యావర్.. తేజకు యావర్ షాక్..!

Advertisment
తాజా కథనాలు