Bigg Boss Telugu Winners: బిగ్‌బాస్.. బుల్లితెర అభిమానులను ఉర్రూతలూగిస్తున్న రియాల్టీ షో. హాలీవుడ్‌లో ప్రారంభమైన ఈ క్రేజీ షో భారత్‌లోనూ సూపర్ సక్సెస్ సాధిస్తోంది. కేవలం హిందీలోనే కాదు ప్రాంతీయ భాషల్లో బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న బిగ్ బాస్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. తెలుగులో ఇప్పటి వరకూ ఏడు సీజన్లు పూర్తయ్యాయి.
ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 ఎన్నో ట్విస్టులతో ఆసక్తికరంగా సాగింది. 15 వారాల పాటు సాగిన ఈ రియాలిటీ షో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ రోజుతో బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ ఎవరనే ప్రశ్నకు తెర పడింది. అమర్, పల్లవి ప్రశాంత్, శివాజీ మధ్య జరిగిన టైటిల్ పోరులో ప్రేక్షకుల నుంచి అత్యధిక ఓట్స్ పొందిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు. అయితే, మిగతా ఆరు సీజన్లలో విజేతలైన వారు ఇప్పుడు ఏం చేస్తున్నారో ఒక్కసారి చూద్దాం.
ఇది కూడా చదవండి: రైతు బిడ్డ రాజయ్యాడు.. బిగ్ బాస్ చరిత్రలో నెవర్ బిఫోర్..!
బిగ్‌బాస్ సీజన్ సిక్స్‌లో రేవంత్ (Singer Revanth) విజేతగా నిలిచాడు. సింగర్‌గా రేవంత్‌కు మంచి పేరు ఉంది. బిగ్‌బాస్ 6కి ముందు సోనీ టీవీలో నిర్వహించిన ఇండియన్ ఐడల్ 9 విజేతగా నిలిచాడు రేవంత్. బాహుబలి సినిమాలోని మనోహరి పాటతో ఫేమస్ అయ్యాడు. బిగ్‌బాస్‌లోకి రాకముందే మనోడికి మంచి ఫేమ్ ఉంది. బిగ్‌బాస్ విజేతగా రేవంత్‌కు రూ .10 లక్షలతో పాటు సువర్ణభూమి వారి 650 గజాల ఫ్లాట్ కూడా పొందాడు. మొత్తంగా వీటి వాల్యూ దాదాపు రూ. కోటి వరకు ఉంటుందనేది టాక్.
బిగ్‌బాస్ సీజన్ 5 విజేత సన్నీ. |బిగ్ బాస్ హౌజ్‌లో చివరి వరకు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న సన్నీ.. బిగ్‌బాస్ సీజన్ 5 ఫినాలేలో దాదాపు 50 శాతం ఓట్లు సాధించాడు. బిగ్‌బాస్ సీజన్ 5 విజేతగా టైటిల్ ట్రోపీతో పాటు రూ. 50 లక్షల క్యాష్ ప్రైజ్, షాద్ నగర్‌లో సువర్ణభూమి నుంచి రూ. 25 లక్షల ఫ్లాట్, ఓ టీవీయస్ బైక్ బహుమతులుగా గెలిచాడు. ప్రస్తుతం చిన్న చితకా సినిమాలు చేస్తున్నాడు.
ఇది కూడా చదవండి: మళ్లీ పెళ్లిపై సమంత ఏమందో తెలుసా..!
బిగ్‌బాస్ సీజన్ 4 విజేత అభిజీత్. టైటిల్ గెలిచిన తర్వాత అభిజిత్‌కు పెద్దగా అవకాశాలు రాలేదు. దీనికి ప్రధాన కారణం కోవిడ్ అని చెప్పుకోవచ్చు. కరోనా నేపథ్యం అన్ని రంగాలతో పాటు సినీ రంగం కూడా మూతపడింది. దీంతో అభిజిత్‌కు అంతగా ఛాన్సులు రాలేదు. మరి భవిష్యత్తులో కొత్తగా ఏమైనా అవకాశాలు వస్తాయా లేదా అనేది చూడాలి.
బిగ్‌బాస్ సీజన్ 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj). ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయ్యాడు. ఆస్కార్ వేదికపై పాట పాడిన తొలి భారతీయ గాయకుడిగా రికార్డు సృష్టించాడు. బిగ్‌బాస్ విజేతల్లో ఎక్కువ లాభపడింది పాతబస్తీ కుర్రోడు రాహుల్ సిప్లిగంజ్ అనే చెప్పాలి. ఈ ఏడాది కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండలో కీరోల్‌లో నటించి మెప్పించాడు. ఇక ఇతను హౌస్‌లో ఉన్నన్ని రోజులు.. పునర్నవితో జరిపిన ఆన్ స్క్రీన్ రొమాన్స్‌తో వార్తల్లో నిలిచాడు. మొత్తంగా ఆర్ఆర్ఆర్ లోని నాటు నాటు పాటను కాల బైరవతో గొంతు కలిపి వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయిపోయాడు రాహుల్ సిప్లిగంజ్.
ఇది కూడా చదవండి: 2024లో ఈ 4 రాశుల స్త్రీలకు పట్టిందల్లా బంగారమే..!
బిగ్‌బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్ మందా. బిగ్‌బాస్ 2 విజేతగా నిలిచిన తర్వాత కౌశల్ ఒకటి రెండు నెలలు మాత్రం కొన్ని షాప్ ఓపెనింగ్స్‌కు రిబ్బన్ కటింగ్‌లు, టీవీ చానెల్స్‌లో ఇంటర్వ్యూలు తప్పించి పెద్దగా సాధించిందేమీ లేదనే చెప్పాలి. ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి కాషాయ కండువా కప్పుకున్నారు.
బిగ్‌బాస్ సీజన్ 1లో విజేత శివబాలాజీ. టైటిల్ గెలిచిన తర్వాత ఓ వారం రోజుల పాటు ఛానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చి హడావుడి చేశాడు. ఆ తర్వాత శివబాలాజీని ప్రేక్షకులు మర్చిపోయారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లే ముందు కాస్తో కూస్తో సినిమాలు చేసిన శివ బాలాజీ.. బిగ్‌బాస్ సీజన్ వన్ విజేతగా నిలిచిన తర్వాత ఛాన్సులు లేకుండా పోయాయి. మొత్తంగా బిగ్‌బాస్ సీజన్‌తో ఇతను పూర్తిగా ఫేడౌట్ అయిపోయాడనే చెప్పొచ్చు.