బిగ్ బాస్ విన్నర్ ర్యాలీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్.!

బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ విజయోత్సవ ర్యాలీలో జరిగిన గొడవల్లో భాగంగా మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపారు. సరూర్ నగర్‌కు చెందిన అవినాష్ రెడ్డి, యూసఫ్ గూడా సుధాకర్, ప‌వ‌న్‌ల‌ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు.

బిగ్ బాస్ విన్నర్ ర్యాలీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్.!
New Update

బిగ్ బాస్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ విజయోత్సవ ర్యాలీలో జరిగిన గొడవల్లో భాగంగా మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపారు. సరూర్ నగర్‌కు చెందిన అవినాష్ రెడ్డి, యూసఫ్ గూడాకు చెందిన సుధాకర్, ప‌వ‌న్‌ల‌ను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు.

Bigg Boss : తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ వివాదంలో అరెస్టుల పరంపరం కొనసాగుతూనే ఉంది. రైతు బిడ్డగా పాపులారిటీ పొంది సీజన్ 7లోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ (Pallavi Prashanth) విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ప్రశాంత్ విజయోత్సవ ర్యాలీలో జరిగిన గొడవల్లో ఇప్పటికే ప్రశాంత్ తోపాటు పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు జూబ్లీహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ఇప్పటివ‌ర‌కు 24 మందిని నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. అయితే విచారణలో భాగంగా ఈ ఇష్యూలో మరో ముగ్గురు సరూర్ నగర్‌కు చెందిన అవినాష్ రెడ్డి, యూసఫ్ గూడాకు చెందిన సుధాకర్, ప‌వ‌న్‌ల‌ ప్రమేయం ఉన్నట్లు తేలడంతో అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరు పరిచినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి : రైతులకు గుడ్ న్యూస్.. రేవంత్ సర్కార్ సరికొత్త స్కీమ్!

ఇక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ, ప్రైవేటు వాహనాల ధ్వంసం కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ప్రశాంత్‌కు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. పోలీసుల ముందు విచారణకు ఆదివారం హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. అలాగే రూ.15 వేల చొప్పున రెండు షూరిటీలు సమర్పించాలని కోర్టు తెలిపింది. ఈ ఘటనలో ప్రశాంత్‌తోపాటు అతని సోదరుడు మహావీర్‌ను (Mahaveer) పోలీసులు అరెస్టు చేయగా.. వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం ఇద్దరికీ 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో ఇద్దరినీ జూబ్లీహిల్స్‌ పోలీసులు చంచల్‌గూడ జైలుకు (Chanchalguda Jail) తరలించారు. అలాగే ఈ ఇష్యూలో నాగార్జునను కూడా అరెస్ట్ చేయాలంటూ ఓ న్యాయవాది హైకోర్టులో ఫిటిషన్ వేశారు. అసభ్యకరమైన షోలు నిర్వహిస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని, వెంటనే నాగార్జునతోపాటు నిర్వాహకులను అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని కోరండం విశేషం. కాగా దీనిపై కోర్టు ఇంకా ఎలాంటి తీర్పు వెల్లడించలేదు.

#bigg-boss #winner #rally-case #boys-arrested
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe