Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ హీరోగా.. భోలే మ్యూజిక్ డైరెక్టర్.. వివరాలివే..? కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ విజేతగా గెలిచి సెలెబ్రెటీల మారాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశాంత్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తోంది. భోలే మ్యూజిక్ డైరెక్టర్ గా, ప్రశాంత్ హీరోగా సినిమా చేయనున్నారు అంటూ నెట్టింట్లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. By Archana 27 Dec 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Pallavi Prashanth: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బిగ్ బాస్ విజేత (Bigg Boss Winner) పల్లవి ప్రశాంత్ పేరే వినిపిస్తోంది. బిగ్ బాస్ తర్వాత ప్రశాంత్ ఒక సెలెబ్రెటీగా మారాడు. పట్టుదలతో ఏదైనా సాధించగలమని నిరూపించాడు రైతు బిడ్డ. ఒక కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగు పెట్టిన ప్రశాంత్.. బిగ్ బాస్ టైటిల్ గెలిచి చరిత్ర సృష్టించాడు. సెలెబ్రెటీలు మాత్రమే విన్ అవుతారనే ప్రేక్షకుల భావనను తొలగించి..సామాన్యులు కూడా బిగ్ బాస్ టైటిల్ గెలవచ్చని ప్రూవ్ చేశారు రైతు బిడ్డ. కానీ గెలిచానని సంతోషం కనీసం రెండు రోజులు కూడా లేకపోయింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ తర్వాత అన్నపూర్ణ స్థూడియో ముందు అభిమానులు చేసిన రచ్చ కారణంగా అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల ధ్వంశానికి కారణమయ్యారని పోలీసులు నమోదు చేసిన కేసులో అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. ఇది ఇలా ఉండగా ప్రశాంత్ కు (Pallavi Prashanth) సంబంధించి నెట్టింట్లో మరో చర్చ మొదలైంది. ప్రశాంత్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారాయి. Also Read: Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ కోసం సింగర్ భోలే ఫైట్..! బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన భోలే గురించి అందరికీ తెలుసు. ఇటీవలే భోలే ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఆయనకు హీరోగా అవకాశాలు వచ్చాయి. కొంత మంది డైరెక్టర్స్ ప్రశాంత్ ను హీరోగా తీసుకోవడానికి ఇష్టపడ్డారు. ఈ విషయం ప్రశాంత్ బయటకు వచ్చాక చెప్పాలనుకున్న.. కానీ బయటకు వచ్చాక ఆయన అరెస్ట్ కావడంతో ఈ విషయం గురించి చెప్పలేదు. రైతు బిడ్డ హీరోగా, పాట బిడ్డ మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమా తీస్తామని చాలా మంది నిర్మాతలు నాతో చెప్పారని తెలిపాడు. ప్రశాంత్ కు హీరోగా చేయాలనే ఇష్టం ఉంటే.. ఖచ్చితంగా హీరో అవుతాడని భోలే మాట్లాడాడు. దీంతో భోలే మాట్లాడిన ఈ మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. #bigg-boss-pallavi-prashanth #pallavi-prashanth #bigg-boss-7-telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి