Bigg Boss Telugu 8: ''బిగ్ బాస్ సీజన్ 8.. ఇక్కడ అన్నీ లిమిట్ లెస్'' అని నాగార్జున చెప్పినట్లుగానే రోజుకో ట్విస్ట్, టర్న్స్ తో బిగ్ బాస్ ఆసక్తికరంగా సాగుతోంది. ఇక అందరు ఎదురు చూసే ఎలిమినేషన్ ఎపిసోడ్ కూడా వచ్చేసింది. మొదటి వారం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్ళేది ఎవరా.? అని తెలుసుకోవడానికి ప్రేక్షకుల చాలా ఆసక్తిగా ఉన్నారు.
ఫస్ట్ వీక్ నామినేటెడ్ కంటెస్టెంట్
అయితే ఫస్ట్ వీక్ మొత్తం ఆరుగురు సభ్యులు నామినేషన్స్ లో ఉన్నారు. విష్ణు ప్రియా, బేబక్క, మణికంఠ, సోనియా ఆకుల, పృథ్వీ రాజ్, శేఖర్ భాషా ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. ఈ ఆరుగురు కంటెస్టెంట్స్ లో బెజవాడ బేబక్క, శేఖర్ భాష పేర్లు ఎలిమినేషన్ లిస్ట్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఆన్ లైన్ పోల్స్ ప్రకారం బేబక్క, శేఖర్ భాష ఇద్దరిలో ఒకరు ఈ వారం బయటకు వెళ్లే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక విష్ణు ప్రియా, మణికంఠ, సోనియా ఆకుల, పృథ్వీ రాజ్ విషయాని వస్తే వీళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ తక్కువగా కనిపిస్తున్నాయి. విష్ణు ప్రియా, సోనియా ఆకుల, పృథ్వీ రాజ్ బయట ఫెమిలియర్ ఫేసెస్ కావడంతో ఆల్రెడీ వాళ్లకు ఒక సెట్ ఆఫ్ ఫ్యాన్స్ ఉంటారు. అంతే కాకుండా హౌస్ లో కూడా వీళ్ళు ప్రతీ ఆర్గుమెంట్ లో కనిపించడం, స్క్రీన్ స్పేస్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. అందుకని ఈ ముగ్గురికి కాస్త ఓటింగ్ పడే ఛాన్స్ ఉంది. ఇక మణికంఠ విషయానికి వస్తే అతనికి సింపతీ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. నామినేషన్స్ రోజు హౌస్ మేట్స్ అంతా అతన్ని టార్గెట్ చేయడం, మణికంఠ తన ఫ్లాష్ బ్యాక్ చెప్పి కన్నీళ్లు పెట్టుకోవడం ఇవి అతడికి జనాల్లో సాఫ్ట్ కార్నర్ ను క్రియేట్ చేశాయి. దీంతో మణికంఠకు ఓటింగ్ పెరిగి ఛాన్స్ ఉంది. మిగిలిన బేబక్క, శేఖర్ భాష ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వచ్చు.
బేబక్క ఎలిమినేషన్
ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ ప్రకారం కూడా వీరిద్దరిలో బేబక్క లీస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. బేబక్క ఇంట్లో అందరితో కలిసి మెలిసి ఉన్నప్పటికీ.. టాస్క్ లో కనిపించకపోవడం ఆమెకు మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక శేఖర్ భాష ఇంట్లోకి వచ్చే ముందే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. అలాగే ఇంట్లో కూడా బేబక్క తో పోలిస్తే శేఖర్ భాష కాస్త యాక్టివ్ గానే కనిపించాడు. దీంతో శేఖర్ భాష సేవ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ శేఖర్ భాష ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ ట్విస్ట్ అనే చెప్పాలి.
Also Read: Bhargavi Nilayam: ఏడాది తర్వాత ఓటీటీలో టోవినో థామస్ థ్రిల్లర్ 'భార్గవి నిలయం' - Rtvlive.com