Bigg Boss Sohel: యాంకర్ సుమ చేసిన పనికి.. ఎమోషనల్ అయిన సోహైల్

సోహైల్ తన లేటెస్ట్ మూవీ 'బూట్‌ కట్‌ బాలరాజు' ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో యాంకర్ సుమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డబ్బులు ఎక్కువ ఇవ్వలేనని తన ఇబ్బందిని చెప్పడంతో.. సుమక్క ఫ్రీగా ప్రీ రిలీజ్ హోస్ట్ చేస్తానని మాటిచ్చిందంటూ ఎమోషనల్ అయ్యాడు.

New Update
Bigg Boss Sohel: యాంకర్ సుమ చేసిన పనికి.. ఎమోషనల్ అయిన సోహైల్

Bootcut Balaraju Pre Release: బుల్లి తెర ప్రేక్షకులకు బిగ్ బాస్ ఫేమ్ సయ్యద్‌ సోహైల్‌ (Bigg Boss Sohel) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ సీరియల్స్ షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టిన సోహైల్ బిగ్ బాస్ సీజన్ 4 ఫైనలిస్ట్ గా ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. బిగ్ బాస్ తర్వాత ఫుల్ క్రేజ్ దక్కించేకున్న సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, Mr ప్రెగ్నెంట్ చిత్రాలు చేశారు. ఇక ఇప్పుడు శ్రీ కోనేటి దర్శకత్వంలో సోహైల్ (Syed Sohel Ryan) నటించిన లేటెస్ట్ చిత్రం 'బూట్‌ కట్‌ బాలరాజు' (Bootcut Balaraju). పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో వినోదాత్మకంగా సాగే ఓ ఆసక్తికరమైన కథాంశంతో ఈ మూవీ రూపొందింది.  ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానున్న నేపథ్యంలో సోహైల్ అండ్ మూవీ టీమ్ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఈ సినిమాకు సోహైల్ నిర్మాత కావడంతో మరింత భారం పెరిగిపోయింది. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడానికి పలు ఈవెంట్స్, షోస్ లో పాల్గొంటున్నారు.

Filmfare Awards 2024: ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్ లో బాలీవుడ్ భామల.. బ్యూటీ లుక్స్

publive-image

యాంకర్ సుమ చేసిన పనికి.. ఎమోషనల్ అయిన సోహైల్

ఇది ఇలా ఉంటే తాజాగా 'బూట్‌ కట్‌ బాలరాజు' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో యాంకర్ సుమ పై సోహైల్ చేసిన ఆసక్తికరమైన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. అయితే సోహైల్ తన సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సుమ యాంకర్ (Anchor Suma) గా ఉంటే బాగుంటుందని అనుకున్నారట. దీని కోసం సుమ మేనేజర్ కు కాల్ చేసి.. ఎక్కువ డబ్బులు ఇవ్వలేను కొంచం తగ్గించాలని కోరాడట. ఆ తర్వాత విషయం తెలుసుకున్న సుమ సోహైల్ కు కాల్ చేసి.. తాను లైఫ్ లో చాలా ఎదిగిన తర్వాత కూడా మీలాంటి వాళ్లకు సాయం చేయకపోతే ఎందుకు.. నేను నీ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫ్రీగా చేస్తానని చెప్పిందంటూ సుమ చేసిన సాయం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు సోహైల్. తనను ఇంతగా సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని ప్రీ రిలీజ్ వేదిక పై సుమకు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Anchor Sreemukhi : పింక్‌ డ్రెస్‌లో మత్తెక్కిస్తున్న శ్రీముఖి.. ఫొటోలు చూస్తే ఫ్లాట్‌ అవ్వాల్సిందే

Advertisment
తాజా కథనాలు