Bigg Boss Season7: నామినేషన్స్ లో శివాజీ పిట్ట కథ.. గ్రూపిజమ్ పై ఫైర్ అయిన శివాజీ..!

బిగ్ బాస్ హౌస్ లో వారాలు గడిచే కొద్దీ ఇంటి సభ్యుల మధ్య గొడవలు కూడా పెరుగుతున్నాయి.. ఇక శివాజీ అయితే ఇంట్లో అంతా గ్రూపులు గా ఆడుతున్నారు అంటూ కొందరి పై ఆరోపణలు చేసారు.

New Update
Bigg Boss Season7: నామినేషన్స్ లో శివాజీ పిట్ట కథ.. గ్రూపిజమ్ పై ఫైర్ అయిన శివాజీ..!

Bigg Boss Season7:  ఎపిసోడ్ స్టార్ అవ్వగానే బిగ్ బాస్.. శివాజీ మీ పవర్ అస్త్రా కోల్పోయినందున మీరు VIP రూమ్ నుంచి బయటకి రావాలి అలాగే మీకు ఉన్న పవర్స్ అన్ని కోల్పోతారు అని చెప్తారు. తర్వాత శివాజీ ఎక్కడ పడుకోవాలి అనే దాని పై శోభా, తేజ మధ్య కాస్త గొడవ జరుగుతుంది.. ఇక్కడ నీ డెసిషన్ మాకు అవసరం లేదు అంటూ శోభా తేజ పై అరుస్తుంది..

శివాజీ పిట్ట కథ

ముందుగా బిగ్ బాస్ శివాజీని పిలుస్తారు నామినేషన్ చేయడానికి.. శివాజీ రాగానే ఇండైరెక్ట్ గా అమర్, ప్రియాంక, శోభా, సందీప్ ను ఉద్దేశించి ఓ పిట్టా కథ చెప్తాడు.. నలుగురు దొంగలు కలిసి .. బ్యాంకు రాబరీ అంటూ జులాయి సినిమా కథ చెప్తాడు. ఇక్కడ అంత గ్రూపులుగా ఆడుతున్నారు.. అది చాలా తప్పుడు ఆట, అది కరెక్ట్ కాదు అని పేర్లు చెప్పకుండా ఇండైరెక్ట్ గా స్టార్ మా బ్యాచ్ పై ఘాటు వ్యాఖ్యలే చేసారు.

శివాజీ VS అమర్

ఇక నా నామినేషన్ అమర్ అని చెప్పి.. అమర్ నేను ఎప్పుడు నిన్ను చూడట్లేదు, నీ పట్ల పక్షపాతంగా ఉంటున్నాను  అని చెప్తున్నావు కానీ నేను ఎప్పుడు అలా చేయలేదు అంటూ అమర్ పై ఫైర్ అవుతాడు. దానికి అమర్ మీరు ప్రశాంత్, యావర్ గెలిస్తే సంతోషించారు కదా కనీసం నన్ను ఎంకరేజ్ కూడా చేయరు కదా అంటూ ఇద్దరి మధ్య పెద్ద ఆర్గుమెంటే జరుగుతుంది. చివరిలో అమర్ గెలిస్తే స్వీటు , ఓడితే పచ్చి మిరపకాయ అంతే కదా అంటూ ఓ పంచ్ డైలాగు కూడా వేస్తాడు. దానికి శివాజీ మాటలు మాత్రమే ఉన్నాయి తమ్ముడు చేతలు లేవు అంటూ రిప్లై ఇస్తాడు..

ప్రియాంక, శివాజీ గొడవ..

శివాజీ ప్రియాంక ను నామినేట్ చేస్తూ నువ్వు 80 శాతం కరెక్ట్ గా ఉన్నది ఉన్నట్లు చెప్తావు ఒక 20% కొందరి విషయాల్లో సూటిగా నీ అభిప్రాయాన్ని చెప్పావు. వీకెండ్ ఎపిసోడ్ లో ఆలోచించకుండా నన్ను హౌస్ మెట్ గా అనర్హుడు అని ప్రకటించావు అంటాడు. దానికి ప్రియాంక నేను క్లారిటీ గానే చెప్పాను.. నేను ఎప్పుడు బ్లైండ్ ఏది చెప్పలేదు అంటూ సమాధానమిస్తుంది.

గ్రూపుల పై తేజ క్లారిటీ

శుభ శ్రీ, శివాజీ అంతా గ్రూపులుగా ఆడుతున్నారు అంటూ చేసిన వ్యాఖ్యలకు సమాధానమిస్తూ తేజ గ్రూపుల పై ఓ క్లారిటీ ఇస్తాడు. గ్రూపిజం అంటే అందరు కలిసి ఒకరిని నామినేట్ చేయడం లేదా ఒకరినే టార్గెట్ చేస్తూ వాళ్ళని ఆటలో ముందుకు వెళ్లనివ్వకుండా చేయడం అంతే గాని ముందే పరిచయం ఉన్న వాళ్ళు కలిసి మాట్లాడుకోవడం, స్నేహితులు గా ఉండటం కాదు అంటూ గొప్ప డెఫినేషన్ చెప్తాడు.. తేజ చెప్పిన అంతా చప్పట్లు కూడా కొడతారు.

నన్ను పంపించేయండి అంటున్న శివాజీ

శివాజీ ఒంటరిగా కూర్చొని .. బిగ్ బాస్ మీరు కూడా తొండి గేమ్ ఆడుతున్నారు.. వాళ్ళు చేసిన పనికి నాకు శిక్ష వేశారు అయినా సరే, కానీ నాకు కనీసం కాఫీ కూడా ఇవ్వట్లేదు.. వీటన్నింటి మధ్య నేను ఉండలేను , నా వల్ల కాదు వెళ్ళిపోతాను అంటూ బాధపడతాడు.

చివరికి బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇస్తాడు ఎవరు ఇంట్లో ఉండాలి, ఎవరు బయటకి వెళ్ళాలి అనేది జనాలు డిసైడ్ చేస్తారు అంటూ అందరిని నామినేషన్స్ లో పెడతారు.. ఈ సారి హైలెట్ ఏంటంటే అమర్ ని నామినేట్ చేసిన చాలా మంది ప్రియాంకను కూడా నామినేట్ చేసారు.

Also Read:  Bigg Boss 7 Sivaji: బిగ్ బాస్ సెన్సేషన్ శివాజీకి అక్కడ 20 ఎకరాలు.. ఇంకా ఎంత ఆస్తి ఉందో తెలుసా?

Advertisment
తాజా కథనాలు