Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. దీపావళి స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా సెలెబ్రెటీస్, ఫ్యామిలీ మెంబర్స్ తో బిగ్ బాస్ స్టేజ్ అంతా సందడిగా మారింది. నిన్నటి ఎపిసోడ్ లో హౌస్ మేట్స్ కోసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ స్టేజ్ పైకి వచ్చారు. దీపావళి సందర్భంగా ఎపిసోడ్ అంతా ఆట, పాటలతో సరదాగా సాగింది. స్టేజ్ పైకి వచ్చిన ప్రతీ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ అంచనా ప్రకారం టాప్ 5 లో ఉండబోయే కంటెస్టెంట్స్ ఎవరో తెలిపారు. అలాగే హౌస్ మేట్స్ కు వాళ్ళ గేమ్ గురించి కొన్ని సలహాలు కూడా ఇచ్చారు.
ఎవ్వరికీ భయపడకు.. తిప్పరా మీసం..
అమర్ (Amar) కోసం.. వాళ్ళ అమ్మ, తన బెస్ట్ ఫ్రెండ్ మానస్ ఇద్దరు స్టేజ్ పైకి వచ్చారు. మానస్ మాట్లాడుతూ.. "అమర్ గేమ్ చాలా బాగా ఆడుతున్నావు.. ఎందుకు భయపడుతున్నావు .. ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు.. తిప్పరా మీసం అంటూ అమర్ లో ఫుల్ కాన్ఫిడెన్స్ నింపాడు. ఈ మాటలతో అమర్ గేమ్ మరింత చేంజ్ అయ్యే అవకాశం ఉంది. "ఇక్కడ అక్క , చెల్లి, బావ ఎవ్వరు లేరు.. నీ గేమ్ నువ్వు ఆడు" అని అమర్ కు మంచి సలహాలు ఇచ్చాడు.
ప్రతి ఇంట్లో శివన్న ఉన్నాడు.. నాన్న
ఆ తర్వాత శివాజీ కోసం.. తన కొడుకు, వైఫ్ ఇద్దరు స్టేజ్ పైకి వచ్చారు. స్టేజ్ పై శివాజీ (Shivaji) కొడుకు మామూలుగా ఫన్ చేయలేదు.. చివరికి నాగార్జున కూడా శివాజీ.. "నీ కొడుకులో మంచి సెన్సాఫ్ హ్యూమర్" ఉందని పొగిడేశారు. ఇక శివాజీ కొడుకు వాళ్ళ నాన్నకు గేమ్ విషయంలో మంచి సలహాలు ఇచ్చాడు. "ఇప్పటికే నువ్వు అందరి మనసులు గెలుచుకున్నావు .. ఈ 5 వీక్స్ బాగా ఆడి జనాలను పూర్తిగా గెలుచుకోవాలని చెప్పాడు." ఇండైరెక్ట్ గా ఈ 5 వారాలు బాగా ఆడితే కప్పు నీదే అన్నట్లుగా సలహా ఇచ్చాడు. "నువ్వు ఎంత పెద్ద హీరోవో నాకు తెలియదు.. కానీ ఇప్పుడు ప్రతి ఇంట్లో శివన్న ఉన్నాడు.. ఇంకెప్పుడు ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతా అనకండి నాన్న" అని శివాజీకి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు కొడుకు.
భోలే ఎలిమినేటెడ్
ఈ వారం నామినేషన్స్ లో ఉన్న శివాజీ, యావర్, భోలే (Bhole), గౌతమ్, రతిక ఐదుగురిలో గౌతమ్, శివాజీ, రతిక ముందుగా సేవ్ అయ్యారు. చివరిలో యావర్, భోలే ఇద్దరి మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. ఈ ఎలిమినేషన్ ప్రక్రియలో భోలే ఎలిమినేట్ అయ్యి.. ఇంటి నుంచి బయటకు వచ్చాడు.
Also Read: Bigg Boss 7 Telugu: భోలే ఎలిమినేటెడ్..! రతికకు ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ ..!