Sarayu : 'ఇప్పటివరకు ఎన్నిసార్లు సెక్స్ చేసావ్?' 'బిగ్ బాస్' నటికి ఊహించని ప్రశ్న.. ఆన్సర్ అదుర్స్

'బిగ్ బాస్' నటి సరయుని ఓ నెటిజన్.. 'మీరు ఇప్పటివరకు ఎన్ని సార్లు సెక్స్ చేసారు?' అని ప్రశ్న వేసాడు. ఆ ప్రశ్నతో షాక్ అయిన సరయు.. సదరు నెటిజన్ కి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.

New Update
Sarayu : 'ఇప్పటివరకు ఎన్నిసార్లు సెక్స్ చేసావ్?' 'బిగ్ బాస్' నటికి ఊహించని ప్రశ్న.. ఆన్సర్ అదుర్స్

Bigg Boss Sarayu : ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా(Social Media) వాడకం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సామాన్యుల నుంచి సెలెబ్రిటీ(Celebrities) ల వరకు అందరూ సోషల్ మీడియాతోనే కాలక్షేపం చేస్తున్నారు. అయితే ఈ సోషల్ మీడియాతో ఎంత లాభం ఉందో, అంతే నష్టం కూడా ఉంది. ముఖ్యంగా ఆడవాళ్లకు. కొందరు ఆకతాయిలు సోషల్ మీడియా ద్వారా ఆడవాళ్లను వేధిస్తున్నారు. అటు సినీ సెలేబ్రిటిలకు సైతం ఈ వేధింపులు తప్పడం లేదు. ఇప్పటికే చాలా మంచి నటీనటులు దీన్ని ఫేస్ చేశారు. ఇప్పుడు తాజాగా ఇలాంటి ఘటనను 'బిగ్ బాస్' నటి సరయు(Sarayu) ఎదుర్కొంది.

యూట్యూబ్ లో అడల్ట్ షార్ట్ ఫిలిమ్స్ తో బాగా పాపులర్ అయింది సరయు. ఈమె నటించిన '7 ఆర్ట్స్' అనే షార్ట్ సిరీస్ యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబట్టింది. ఈ సిరీస్ లో సరయు డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో ఓ రేంజ్ లో రెచ్చిపోయింది. దీంతో సరయుకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ రావడంతో.. ఆ క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది. కాకపోతే హౌస్ లో కేవలం వారం మాత్రమే ఉంది. బిగ్ బాస్ తర్వాత కొన్ని చిన్న సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సరయు తాజాగా అభిమానులతో చిట్ చాట్ చేసింది.

ఇందులో భాగంగానే ఓ నెటిజన్ సరయుని.. 'మీరు ఇప్పటివరకు ఎన్ని సార్లు సెక్స్ చేసారు?' అని ప్రశ్న వేసాడు. ఆ ప్రశ్నతో షాక్ అయిన సరయు.. సదరు నెటిజన్ కి తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. మాములుగా ఇలాంటి ప్రశ్నలు వేసినప్పుడు సెలెబ్రిటీలు పెద్దగా రెస్పాండ్ అవ్వకుండా ఇగ్నోర్ చేస్తారు. కానీ సరయు మాత్రం.." ఇలాంటి ప్రశ్నలకు ఏం జవాబు చెబుతార్రా బాబు?" అంటూ ఆ నెటిజన్ కి కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా నిఖిల్ '18 పేజెస్' మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ రోల్ లో ఆకట్టుకున్న సరయు.. ప్రస్తుతం పలు సినిమాలతో పాటూ వెబ్ సిరీస్ లలో నటిస్తోంది.

Also Read : ఏంటి.. ‘పుష్ప’ లో ‘కేశవ’ రోల్ కోసం మొదట ఆ హీరోని అనుకున్నారా?

Advertisment
Advertisment
తాజా కథనాలు