Bigg Boss 8 Telugu : బిగ్ బాస్- 8 లో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆమేనా?

బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ నామినేషన్స్ లో విష్ణు ప్రియా, సోనియా, శేఖర్ బాషా, నాగ మణికంఠ, పృథ్వీ, బెజవాడ బేబక్క ఉన్నారు. వీరిలో బెజవాడ బేబక్క, పృథ్వీ డేంజర్ జోన్ లో ఉన్నారు. బెజవాడ బేబక్కకు తక్కువ ఓట్లు పడటంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

New Update
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్- 8 లో ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఆమేనా?

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ వీక్ ముగిసే సమయం దగ్గర పడింది. హౌస్ లో డే 1 నుంచే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. గత సీజన్స్ కంటే ఈ సీజన్ లో నామినేషన్స్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఫస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఒకొక్క కంటెస్టెంట్స్ ఇద్దరినీ నామినేట్ చేయాలి..

అలాగా నామినేట్ అయిన ఇద్దరిలో ఒకరిని హౌస్ చీఫ్ గా నియమించిన ముగ్గురు సేవ్ చేస్తారు. అలా ఈ వారం హౌస్ లో నామినేషన్స్ జరిగాయి. విష్ణు ప్రియా, సోనియా, శేఖర్ బాషా, నాగ మణికంఠ, పృథ్వీ, బెజవాడ బేబక్క. ఈ ఆరుగురు ఈవారం నామినేషన్స్ లో ఉన్నారు. కాగా చీఫ్స్ గా ఉన్న నిఖిల్, నైనిక, యమ్మీ ఈవారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు.

Also Read : వరద బాధితులకు అండగా తెలుగు చిత్ర పరిశ్రమ.. ఫిలిం ఛాంబర్ సంచలన నిర్ణయం

ఇక ఈవారం నామినేట్ అయిన వారిలో తక్కువ ఓట్లు బెజవాడ బేబక్క పడ్డాయని తెలుస్తోంది. దాంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాగమణికంఠ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వడంతో అతను సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక బెజవాడ బేబక్క, పృథ్వీ ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. సో ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు