Bigg Boss 8 Telugu : ఫస్ట్ వీక్ లోనే ఎలిమినేట్ అయిన 'బేబక్క'.. ఎంత సంపాదించిందంటే? తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా బెజవాడ బేబక్క హౌస్ నుండి బయటికొచ్చేసింది. హౌస్ లో వారం రోజులపాటు ఉన్న బేబక్కకు రెమ్యునరేషన్‌గా రూ. 1.30 లక్షల వరకు అందినట్లు తెలుస్తోంది. By Anil Kumar 09 Sep 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Bigg Boss 8 Telugu : తెలుగు బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 మొదటి వారం పూర్తి చేసుకుంది. ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ లో భాగంగా బెజవాడ బేబక్క హౌస్ నుండి బయటికొచ్చేసింది. హౌస్ లో ఏడో కంటెస్ట్ంట్గా బెజవాడ బేబక్క అడుగుపెట్టింది. అయితే, మొదటి వారం నామినేషన్స్ లిస్ట్‌లో విష్ణుప్రియ, బెజవాడ బేబక్క, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, సోనియా ఆకుల, శేఖర్ బాషా ఉన్నారు. వీరందిరిలో బెజవాడ బేబక్కకు తక్కువ ఓట్లు రావడంతో బిగ్‌బాస్ నుంచి నిష్క్రమించింది. ఇదిలా ఉంటే సోషల్ మీడియా ఇన్ ఫ్లూ యెన్సర్ అయిన ఈమెకు మంచి ఫాలోయింగే ఉంది. ఈ క్రమంలోనే వారం రోజులు హౌస్ లో ఉన్న బేబక్కకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చి ఉంటారనే డిస్కషన్ నెట్టింట మొదలైంది. Also Read : ఎన్టీఆర్ తో సందీప్ రెడ్డి వంగా.. ఇది కదా కాంబినేషన్ అంటే ఈ నేపథ్యంలో వారం రోజులపాటు బిగ్ బాస్‌లో ఉన్న బేబక్కకు రెమ్యునరేషన్‌గా రూ. 1.30 లక్షల వరకు అందినట్లు తెలుస్తోంది. ఎప్పుడూ కిచెన్‌లో ఉండే బేబక్క టాస్కుల్లో పెద్దగా ఫెర్ఫామ్ చేయకపోవడమే కాకుండా ఆడియన్స్ కు ఎంటర్టైన్మెంట్ అందించడంలోనూ విఫలం అయ్యారు. అందుకే మొదటి వారమే ఎలిమినేట్ అయిపోయారు. #bezawada-bebakka #bigg-boss-8-telugu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి