Bigg Boss 7 Winner: 35 లక్షల తో పాటు పల్లవి ప్రశాంత్ పొందిన ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవే..!

బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచాడు. ప్రతీ సీజన్ విజేతకు విన్నర్ అమౌంట్ తో పాటు కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఈ సీజన్ లో కూడా విజేత ప్రశాంత్ కు 35 లక్షలతో పాటు 10లక్షలు వాల్యూ చేసే మారుతీ బ్రెజ్జా కార్,15లక్షల చెక్ బహుమతిగా లభించాయి.

New Update
Bigg Boss 7 Winner: 35 లక్షల తో పాటు పల్లవి ప్రశాంత్ పొందిన ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవే..!

Bigg Boss 7 Winner: బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 7 ఆసక్తిగా ముగిసింది. నిన్నటి గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో విజేతను ప్రకటించారు. కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు. సీజన్ మొదట్లో ప్రశాంత్ ఆట తీరు చూసి కొన్ని వారల కంటే ఎక్కువ ఉండలేకపోవచ్చని ఊహించారు. కానీ గేమ్ ముందుకు వెళ్లే కొద్దీ తన ఆట తీరుతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. పట్టుదలతో బిగ్ బాస్ విన్నర్ అవ్వాలనే తన కోరికను నెరవేర్చుకున్నాడు. కామన్ మ్యాన్ గా కప్పు గెలిచి బిగ్ బాస్ చరిత్రలో రికార్డ్ క్రియేట్ చేశాడు. సీరియల్ నటుడు అమర్ దీప్ రన్నర్ అప్ గా నిలిచాడు. ప్రతీ సీజన్ విజేతకు విన్నర్ అమౌంట్ తో పాటు కొన్ని అదనపు బెనిఫిట్స్ కూడా ఉంటాయి. మరి ఈ సీజన్ లో విన్నర్ అమౌంట్ తో పాటు ప్రశాంత్ పొందిన బెనిఫిట్స్ ఏంటో తెలుసుకోండి.

publive-image

ఈ సీజన్ విన్నర్ అమౌంట్ 50 లక్షలుగా ప్రకటించారు. కానీ యావర్ 15 లక్షల సూట్ కేస్ తీసుకొని నాలుగవ స్థానంలో బయటకు వచ్చేశాడు. ఈ 15 లక్షలు విన్నర్ అమౌంట్ నుంచి కోత పడ్డాయి. ప్రైజ్ మనీ 50 లక్షల నుంచి 15 లక్షలు వెళ్లిపోగా ప్రశాంత్ ప్రైజ్ మనీ 35 లక్షలు అయ్యింది. విన్నర్ అమౌంట్ తో పాటు ప్రశాంత్ కు ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా లభించారు. 15 లక్షలు విలువ చేసే చెక్ లభించింది. ఈ మొత్తం డబ్బుతో కేవలం బంగారం మాత్రమే కొనే అవకాశం ఉంటుంది. 15 లక్షల చెక్ తో పాటు 10 లక్షలు విలువగలే మారుతి సుజీకి బ్రెజ్జ బహుమతిగా అందించారు. ప్రైజ్ మనీ అందించిన తర్వాత ప్రశాంత్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. విజేతగా తాను గెలుచుకున్న 35 లక్షలు కష్టాల్లో ఉన్న రైతులకు ఇస్తానని తెలిపారు. అదనంగా వచ్చిన కారు, బంగారం మాత్రం అమ్మ నాన్నకు ఇస్తానని చెప్పాడు. ప్రశాంత్ చేసిన వ్యాఖ్యలు తమ అభిమానులను ఆకట్టుకున్నాయి. రైతు బిడ్డ టైటిల్ గెలిచినందుకు ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేశారు.

Also Read: Bigg Boss 7 Winner: విజేత పల్లవి ప్రశాంత్ పై.. MLA హరీష్ రావు ఆసక్తికర ట్వీట్.!

Advertisment
తాజా కథనాలు