Bigg Boss 7 Telugu: 15 లక్షల సూట్ కేస్ తో యావర్ బయటకు... స్థూడియో ముందు విజువల్స్..!

బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. మరి కొన్ని గంటల్లో విజేత ఎవరో తెలియనుంది. గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన ఓ అప్డేట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. ప్రిన్స్ యావర్ 15 లక్షల సూట్ కేస్ తీసుకొని 4 స్థానంలో బయటకు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.

New Update
Bigg Boss 7 Telugu: 15 లక్షల సూట్ కేస్ తో యావర్ బయటకు... స్థూడియో ముందు విజువల్స్..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 7 ఫైనల్ స్టేజ్ కి వచ్చేసింది. బిగ్ బాస్ ప్రేక్షకుల ఉత్కంఠకు ఈరోజు తెరపడనుంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో ఊహించని ట్విస్టులతో ఆసక్తికరంగా సాగింది సీజన్ 7. ప్రేక్షకులు ఎంతగానో చూస్తున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రోమో కూడా వచ్చేసింది. టాలీవుడ్ సెలెబ్రెటీలు, ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్, ఫ్యామిలీ మెంబర్స్ రాకతో గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ సందడిగా మారింది. మరి కొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ 7 విజేతను ప్రకటించనున్నారు. విజేత ఎవరనే అంశం పై పలు రకాల చర్చలు వినిపిస్తున్నాయి.

బిగ్ బాస్ విజేత ఎవరనే విషయం పై సోషల్ మీడియాలో పలు రకాల మీమ్స్, పోస్టులు వైరలవుతున్నాయి. తాజాగా గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. అమర్, ప్రశాంత్, శివాజీ మధ్య జరిగిన టైటిల్ పోరులో శివాజీ టాప్ 3 లో ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. పల్లవి ప్రశాంత్, అమర్ ఇద్దరిలో ఒకరు సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. అర్జున్ టాప్ 6 లో ముందుగానే ఎలిమినేట్ అయ్యాడని.. ప్రియాంక టాప్ 5 లో ఎలిమినేట్ అయినట్లు బిగ్ బాస్ నుంచి లీకులు బయటకు వస్తున్నాయి. యావర్ 15 లక్షలు తీసుకొని బయటకు వచ్చినట్లు కూడా తెలుస్తోంది.

టాప్ సిక్స్ ఉన్నపుడు 10 లక్షల అమౌంట్ ఆఫర్ చేయగా.. అందరు తీసుకోవడానికి తిరస్కరించారు. ఆ తర్వాత ఎలిమినేట్ అయిన అర్జున్, ప్రియాంక ఖాళీ చేతులతో బయటకు వచ్చారు. టాప్ 4 అమర్, ప్రశాంత్, శివాజీ, యావర్ ఉన్నపుడు 15 లక్షలు ఆఫర్ చేశారు. తెలివిగా ఆలోచించిన యావర్ 15 లక్షల సూట్ కేస్ తీసుకొని బయటకు వచ్చినట్లు లీకైన ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. సూట్ కేస్ తీసుకొని బయటకు రావడం ఇది మొదటి సారి కాదు.. గత సీజన్స్ లో కూడా కొంత మంది కంటెస్టెంట్స్ ఇలానే చేశారు. సీజన్ 4 లో సోహెల్ 25 లక్షలు, సీజన్ 6 లో శ్రీహన్ 40 లక్షల సూట్ కేస్ తో బయటకు వచ్చారు.

Also Read: Bigg Boss Grand Finale: రవితేజ కోసం ట్రోఫీ వదిలేస్తాను.. అమర్ చేసిన పనికి షాకైన మాస్ మహారాజ - Rtvlive.com

Also Read: Bigg Boss Grand Finale: టాప్ 3 లో శివాజీ ఎలిమినేటెడ్.. విన్నర్ అతడే..! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు