Bigg Boss Grand Finale: టాప్ 3 లో శివాజీ ఎలిమినేటెడ్.. విన్నర్ అతడే..!

15 వారల పాటు ఆసక్తిగా సాగిన బిగ్ బాస్ ముగింపు దశకు చేరుకుంది. అమర్, ప్రశాంత్, శివాజీ మధ్య టైటిల్ పోరు జోరుగా సాగుతుంది. దీనికి సంబంధించి నెట్టింట్లో వార్త వైరల్ గా మారింది. మొదటి నుంచి విన్నరని భావించిన శివాజీ టాప్ 3 లోనే ఎలిమినేట్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది.

Bigg Boss Grand Finale: టాప్ 3 లో శివాజీ ఎలిమినేటెడ్.. విన్నర్ అతడే..!
New Update

Bigg Boss Grand Finale: బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో ఆసక్తికరంగా సాగింది. 15 వారాల పాటు సాగిన ఈ రియాలిటీ గేమ్ షో ఊహించని ట్విస్టులతో ప్రేక్షకులలో క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. సీజన్ 7 టాప్ TRP రేటింగ్స్ తో దూసుకెళ్లింది. సూపర్ సక్సెస్ ఫుల్ గా సాగిన సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది. బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ వచ్చేసింది. మరి కొన్ని గంటల్లో బిగ్ బాస్ సీజన్ 7 ట్రోఫీ పట్టుకునేదెవరో తీయనుంది.

15 వారల పాటు రసవత్తరంగా సాగిన ఈ గేమ్ లో 13 మంది కంటెస్టెంట్స్ ను దాటుకొని కేవలం ఆరుగురు మాత్రమే టాప్ సిక్స్ ఫైనలిస్టులుగా నిలిచారు. అమర్, ప్రశాంత్, యావర్, అర్జున్, ప్రియాంక, అర్జున్, శివాజీ, ఫైనల్ రేసులో పోటీ పడుతున్నారు. టాప్ సిక్స్ లో అమర్, ప్రశాంత్, శివాజీ ముగ్గురి మధ్య టైటిల్ పోరు జోరుగా సాగుతుంది. విజేత ఎవరనే అంశం పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

publive-image

ప్రస్తుతం విజేతకు సంబంధించి నెట్టింట్లో ఓ అప్డేట్ వైరల్ గా మారింది. సీజన్ 7 మొదటి నుంచి ప్రేక్షకులంతా విన్నర్ అని భావించిన శివాజీ టాప్ 3 లోనే ఎలిమినేట్ అయ్యాడని సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ నడుస్తోంది. రైతు బిడ్డ రాజయ్యాడు.. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అని.. రెండవ స్థానంలో అమర్ ఉన్నాడని.. టాప్ 4, 5, 6 లో ప్రియాంక, యావర్ ఎలిమినేట్ అయ్యారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి అసలు విజేత ఎవరనేది తెలియాలంటే మరి కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.

Bigg Boss Grand Finale: రవితేజ కోసం ట్రోఫీ వదిలేస్తాను.. అమర్ చేసిన పనికి షాకైన మాస్ మహారాజ - Rtvlive.com

#bigg-boss-7-telugu #bigg-boss-7-latest-episode #bigg-boss-7-telugu-latest-updates #bigg-boss-7
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe