Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ లోకి ఫ్యామిలీ రావడంతో బిగ్ బాస్ ఇల్లంతా సందడిగా మారింది. 10 వారాల నుంచి ఫ్యామిలీస్ కి దూరంగా ఉన్న ఇంటి సభ్యులు చాలా రోజుల తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను చూసి ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. నిన్నటి ఎపిసోడ్ లో అర్జున్ (Arjun) వైఫ్, అశ్విని మదర్, శివాజీ (Shivaji) కొడుకు బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. ఇక ఈరోజు తాజాగా విడుదలైన ప్రోమోలో గౌతమ్ మదర్ బిగ్ బాస్ ఇంట్లోకి ఎంటర్ అయ్యారు.
ఇక బిగ్ బాస్ గౌతమ్ (Goutham) మదర్ ఎంట్రీనీ చాలా స్పెషల్ గా ప్లాన్ చేశారు. ముందుగా 'కన్నయ్యా' అంటూ వాళ్ళ మదర్ వాయిస్ మాత్రమే వినిపించారు. అంతే ముందే ఒక హింట్ ఇస్తూ.. గౌతమ్ కోసం పంచ కూడా పంపారు. ఆ తర్వాత గౌతమ్ మదర్ 'కన్నయ్యా.. పంచ వచ్చిందా'.. అంటూ ఇంట్లోకి వచ్చి గౌతమ్ ని సర్ ప్రైజ్ చేసింది.
అమ్మ ఇంట్లోకి రాగానే గౌతమ్ ఎమోషనల్ అయ్యాడు. ఇక వాళ్ళ అమ్మకు ఇంటి సభ్యులను అంతా పరిచయం చేశాడు. ఆ తర్వాత వాళ్ళ అమ్మతో.. 'నాన్న వస్తారు అనుకున్న .. నాన్న ఏం గొడవ చేయలేదా నేను వెళ్తానని' అంటూ నవ్వాడు. గౌతమ్ మదర్ ఇంటి సభ్యులతో మాట్లాడుతూ.. గౌతమ్ కు అమ్మాయిల ఫాలోయింగ్ పెరిగింది. 'మీ అబ్బాయి హ్యాండ్సమ్ గా ఉన్నాడని చెబుతున్నారు' అంటూ మురిసిపోయింది.
ఆ తర్వాత గౌతమ్ మదర్ హౌస్ మేట్స్ అందరికి అన్నం కలిపి తినిపించింది. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక యావర్ వాళ్ళ అమ్మ గుర్తొచిందని ఏడ్చేశాడు. "నువ్వు కూడా నా కొడుకువే.. మా ఇంటికి ఎప్పుడైనా రావచ్చు" అని యావర్ (Yawar) ను ఓదార్చింది. ప్రోమో చివరిలో గౌతమ్ తో పాటు ఇంటి సభ్యులంతా వాళ్ళ అమ్మతో కలిసి డాన్స్ వేస్తూ.. చాలా ఆనందంగా కనిపించారు.
Also Read: Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఇంట్లోకి అర్జున్ వైఫ్.. ‘కప్పు ముఖ్యం బిగులు’