Bigg Boss 7 Telugu Promo: బిగ్ బాస్ సీజన్ 7 .. బిగ్ బాస్ ఇంట్లో ఫ్యామిలీ వీక్.. చాలా ఎమోషనల్ గా సాగుతోంది. చాలా రోజుల పాటు ఫ్యామిలీస్ కి దూరంగా ఉన్న హౌస్ మేట్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ను చూడగానే చాలా ఎమోషనల్ అయ్యారు. బిగ్ బాస్ ఇంట్లో.. ఫ్యామిలీ ఎపిసోడ్ ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులను కూడా ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో శోభ (Shobha Shetty) మదర్ ఇంట్లోకి వచ్చారు.
శోభ మదర్ సైలెంట్ గా స్టోర్ రూమ్ లో నుంచి వచ్చి సర్ ప్రైజ్ చేసింది. వాళ్ళ మదర్ ను చూసి షాకైన శోభ.. పరుగెత్తుకుంటూ వెళ్లి.. అమ్మను గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. ఇక శోభ అమ్మ కూడా చాలా ఎమోషనల్ అయినట్లుగా ప్రోమోలో కనిపించింది. ఆ తర్వాత శోభ మదర్ ఇంటి సభ్యులందరితో ప్రేమగా మాట్లాడింది. అందరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఇక ఈ ప్రోమోలో బిగ్ బాస్ యావర్ కోసం.. శోభ మదర్ తో ఒక సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపారు. నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్ మదర్ వచ్చినప్పుడు.. చనిపోయిన వాళ్ళ అమ్మ గుర్తొచ్చి కన్నీళ్లు పెట్టుకున్నాడు యావర్. ఇక ఈరోజు యావర్ అమ్మ ఫొటోను.. శోభ మదర్ తో పంపి యావర్ (Yawar) ను సర్ ప్రైజ్ చేశారు బిగ్ బాస్. ఆ ఫొటో చూడగానే శోభ మదర్ ను పట్టుకొని ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు యావర్. ''నువ్వు కూడా నా కొడుకువే ఏడవద్దు" అని ఓదార్చింది శోభ మదర్.
ఆ తర్వాత శోభ అమ్మ.. శోభతో మాట్లాడుతూ.. నీ కోపం గురించి నీకు.. నాకు తెలుసు కానీ బయట వాళ్లకు తెలియదు కదా అని గేమ్ గురించి సలహాలు ఇచ్చింది. గౌతమ్ శోభ మధ్య జరిగిన గొడవ గురించి ఫన్నీగా మాట్లాడారు. ఇక శోభ మదర్ ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు.. బిగ్ బాస్ మంచి అవకాశం ఇచ్చారు.. చాలా అదృష్టంగా భావించాలి.. బాగా ఆడి.. కప్పు కొట్టుకొని రావాలని చెప్పింది.