Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఇంట్లో ప్రియాంక ఫ్లాప్.. అశ్విని షాకింగ్ కామెంట్స్..!

తాజాగా బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన అశ్విని స్టేజ్ పైకి వచ్చింది. వెళ్లేముందు బిగ్ బాస్ అశ్వినికి టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో అశ్విని.. తన అభిప్రాయం ప్రకారం బిగ్ బాస్ ఇంట్లో హిట్ ఎవరు.. ఫ్లాప్ ఎవరో చెప్పాలని తెలిపారు.

Bigg Boss 7 Telugu:  బిగ్ బాస్ ఇంట్లో ప్రియాంక ఫ్లాప్.. అశ్విని షాకింగ్ కామెంట్స్..!
New Update

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 అంతా ఉల్టా పుల్టా . లాస్ట్ వీక్ వీకెండ్ ఎపిసోడ్ నో ఎలిమినేషన్ అని చెప్పడంతో నామినేషన్ లో ఉన్న హౌస్ మేట్స్ కాస్త రిలాక్స్ అయ్యారు. కానీ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని చెప్పి పెద్ద షాకిచ్చారు బిగ్ బాస్. ఇక ఈ వారం నిన్న జరిగిన వీకెండ్ ఎపిసోడ్ లో నామినేషన్స్ లో ఉన్న గౌతమ్, అర్జున్, అమర్, శివాజీ, యావర్, అర్జున్, రతిక, ఏడుగురిలో డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా అశ్విని (Ashwini) ఎలిమినేట్ అయ్యింది.

publive-image

ఇక ఈ రోజు తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన అశ్విని స్టేజ్ పైకి వచ్చింది. స్టేజ్ పైకి వచ్చిన అశ్విని హౌస్ మేట్స్ అందరితో నవ్వుతూ మాట్లాడింది. బిగ్ బాస్ అశ్వినికి ఒక టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో అశ్విని తన అభిప్రాయం ప్రకారం బిగ్ బాస్ ఇంట్లో హిట్ ఎవరు.. ఫ్లాప్ ఎవరో చెప్పాలని తెలిపారు.

Bigg Boss 7 Telugu

మొదటగా అశ్విని ప్రశాంత్ (Pallavi Prashanth) గురించి మాట్లాడుతూ.. కొన్ని సార్లు మాట వినడు.. అని చెప్పింది. దానికి నాగార్జున.. "అశ్విని.. నీకు శివాజీ వాయిస్ మిమిక్రి చేయడం వచ్చా.. అయితే ఆ వాయిస్ తో చెప్పు ప్రశాంత్ వింటాడు" అని కౌంటర్ ఇచ్చినట్లు మాట్లాడారు. ఆ తర్వాత యావర్ గురించి మాట్లాడింది. "యావర్ గుడ్ ఫ్రెండ్.. బిగ్ బాస్ లో నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికాడు.. అనుకోలేదు ఇంత తక్కువ టైంలో మంచి ఫ్రెండ్స్ అవుతామని" చెప్పింది. నాగార్జున ప్రియాంక (Priyanka) గురించి చెప్పు అని అడగగా.. ప్రియాంక మంచిదే.. కానీ తొందరపడి మాట్లాడేస్తుంది.. నా అభిప్రాయంలో ప్రియాంక ఫ్లాప్ అని చెప్పేసింది.

Bigg Boss 7 Telugu

ఆ తర్వాత ఇంట్లో గ్రూప్స్ గురించి మాట్లాడింది. ఇల్లు రెండు గ్రూప్స్ గా డివైడ్ అయ్యింది. శివాజీ, ప్రశాంత్, యావర్, రతిక ఒక గ్రూప్ .. ఇంకోటి.. అమర్, ప్రియాంక, శోభ. మధ్యలో ఏకాకిలా ఎం చేయాలో అర్థం కాక మిగిలిపోయాను సార్ అంటూ నవ్వింది అశ్విని. వెంటనే అర్జున్ ఆ ఏకాకి దాంట్లో కూడా నేను లేనా.. అని నవ్వాడు. ఇక నాగార్జున చుక్క బ్యాచ్, మొక్క బ్యాచ్, తొక్క బ్యాచ్ అని డైలాగ్ వేసి అందరినీ నవ్వించారు.

Bigg Boss 7 Telugu

Also Read: Bigg Boss 7 Telugu: “ఎవరి పొరపాట్లకు వాళ్ళే బలవుతారు”.. అశ్వినికి డబుల్ ఎలిమినేషన్ షాక్..!

#bigg-boss #bigg-boss-7 #bigg-boss-7-telugu #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe