Bigg Boss 7 Telugu: నన్ను కావాలనే కొట్టాడు.. అర్జున్ పై ప్రశాంత్ ఆరోపణలు..!

బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులకు ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ పొందడానికి కొన్ని టాస్క్ లు ఇచ్చారు. ముందుగా ఇచ్చిన టాస్క్ లో అమర్, ఆ తర్వాత టాస్క్ లో అర్జున్ గెలిచి ప్రేక్షకులతో నేరుగా ఓట్ అపీల్ చేసుకునే అవకాశం పొందారు.

Bigg Boss 7 Telugu: నన్ను కావాలనే కొట్టాడు.. అర్జున్ పై ప్రశాంత్ ఆరోపణలు..!
New Update

Prashant's Negative Comments On Arjun : బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ (Bigg Boss 7)ఇంటి సభ్యులకు ప్రేక్షకులతో నేరుగా ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించారు. కానీ ఓట్ అపీల్ చేసుకునే ఛాన్స్ పొందాలంటే హౌస్ మేట్స్ కొన్ని గేమ్స్ ఆడి.. వాటిలో గెలిచిన వారికి నేరుగా ఓట్ అపీల్ చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు బిగ్ బాస్. నిన్నటి ఎపిసోడ్ లో ఓట్ అపీల్ కోసం బిగ్ బాస్ కొన్ని టాస్క్ లు ఇచ్చారు.

టాస్క్ గెలిచిన అమర్

ముందుగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు సాండ్ కేక్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు. ఈ టాస్క్ సాండ్ కేక్ పై ఉన్న చెర్రీ కింద పడకుండా స్లైస్ చేయాలనీ చెప్పారు. దీంట్లో ముందుగా అర్జున్ రేసు నుంచి ఔటయిన అర్జున్ ఈ ఆటకు సంచలకుడిగా వ్యవహరించారు. ఇక ఈ టాస్క్ చివరి వరకు అమర్, ప్రశాంత్ ఇద్దరు ఆడారు. కానీ చివరిలో ప్రశాంత్ చెర్రీ కింద పడడంతో.. అమర్ ఈ టాస్క్ విన్ అయ్యాడు. ఈ టాస్క్ లో గెలిచి అమర్ ఓట్ అపీల్ చేసుకునే అవకాశం పొందాడు.

publive-image

ప్రశాంత్ పై ఫైర్ అయిన అర్జున్

ఆ తర్వాత బిగ్ బాస్ ఓట్ అపీల్ ఛాన్స్ పొందడానికి మరో టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో గెలిచిన వారు రెండవ కంటెండర్ గా నిలుస్తారని తెలిపారు. దీని కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ బజర్ మోగినప్పుడు ముందుగా బెల్ కొట్టిన వారికి ఓట్ అపీల్ అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ టాస్క్ లో అర్జున్ ముందుగా బెల్ కొట్టాడు. ఈ విషయంలో అర్జున్, ప్రశాంత్ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. బెల్ కొట్టే క్రమంలో అర్జున్.. నన్ను తోసాడు అని ప్రశాంత్ ఆరోపించాడు. దానికి అర్జున్.. " సోది చెప్పకు.. నువ్వే నన్ను పట్టుకొని లాగవని చెప్పాడు. ఆ తర్వాత అర్జున్.. వెదవ కారణాలు చెప్పకు .. నేను కావాలని తోసానా అని ప్రశాంత్ పై కోపంగా అరిచాడు.

publive-image

ఉల్లిపాయల టాస్క్

ఈ టాస్క్ లో అర్జున్ ముందుగా బెల్ కొట్టాడు. ఆ తర్వాత బిగ్ బాస్ అర్జున్ ను కన్ఫెషన్ రూమ్ కు పిలిచి.. క్లాత్ మూసి ఉన్న రెండు వస్తువులలో ఒకటి సెలెక్ట్ చేసుకోమని చెప్పారు. ఇక అర్జున్ సెలెక్ట్ చేసిన దాంట్లో మూడు ఉల్లిపాయలు ఉన్నాయి. ఆ మూడు ఉల్లిపాయలు తింటారా..? మరో క్లాత్ లో ఏముందో చూస్తారా..? అని బిగ్ బాస్ అడగగా.. అర్జున్ ఉల్లిపాయలు తింటానని చెప్పాడు. మూడు ఉల్లిపాయలు తినే ఓట్ అపీల్ చేసుకునే అవకాశం పొందాడు.

publive-image

#bigg-boss-pallavi-prashanth #bigg-boss-7 #bigg-boss-7-telugu #arjun #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి