Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసే నామినేషన్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల వాదనలతో బిగ్ బాస్ హౌస్ అంతా హీటెక్కిపోయింది. ప్రోమో చూస్తుంటే ఈ రోజు నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య పెద్ద రచ్చ జరగబోతున్నట్లుగా కనిపించింది.
ఈ నామినేషన్ ప్రక్రియలో రతిక (Rathika), ప్రియాంక (Priyanka) ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సైలెంట్ గా ఉన్న రతిక.. నామినేషన్స్ కు ముందు శివాజీ ఇచ్చిన సలహాతో నామినేషన్స్ లో రెచ్చిపోయింది. ఈ రోజు ప్రోమోలో రతిక, ప్రియాంక ఇద్దరి మధ్య పెద్ద ఆర్గుమెంట్ జరిగింది.
ప్రియాంక రతికను నామినేట్ చేస్తూ.. "నీకు నామినేట్ చేయడానికి పాయింట్స్ దొరకట్లేదు.. ఎదో ఒకటి చెప్పి నామినేట్ చేస్తున్నావు.. అనగానే "ఉన్న దాన్నే తవ్వి.. తవ్వి.. నామినేట్ చేస్తుంది నువ్వు" అని వాదించింది రతిక. ఆ తర్వాత ప్రియాంక మాట్లాడుతూ.. "నేను చేసింది తప్పు అయితే దాని గురించి రచ్చ అయ్యేదని చెప్పింది". దానికి రతిక.. "నువ్వు మాట్లాడేది కరెక్ట్ గానే జనాల్లోకి వెళ్లిందని నీకు ఎలా తెలుసు.. నువ్వు బయటకు వెళ్లి చూసొచ్చావా" అని ప్రియాంక పై అరిచేసింది రతిక. ఇక ప్రియాంక "నువ్వు బయటకు వెళ్లి.. వచ్చిన ఏం చేయలేదులే" అంటూ రతికకు కౌంటర్ వేసింది.
ఈ నామినేషన్ ప్రక్రియలో అశ్విని, ప్రియాంక మధ్య కూడా మాటల యుద్ధం జరిగింది. "ఇంకొకసారి సారి నా ఏడుపు గురించి మాట్లాడితే బాగోదు" అని అశ్విని.. ప్రియాంకకు వార్నింగ్ ఇచ్చినట్లుగా కనిపించింది ప్రోమోలో. ఆ తర్వాత అర్జున్ ప్రశాంత్ తో వాదిస్తూ.. "సోది చెప్పడం ఆపి పాయింట్ మాట్లాడు" అని చెప్పాడు. వీళ్లిద్దరు ఒకరి పై ఒకరు వాదనలు చేస్తూనే ఉన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియలో ఎప్పుడు సైలెంట్ గా ఉండే అర్జున్ (Arjun Ambati).. తనలో మరో యాంగిల్ చూపించాడు. ప్రశాంత్, అర్జున్ ఇద్దరి మధ్య పెద్ద రచ్చ జరుగబోతున్నట్లు ప్రోమోలో కనిపించింది.
Also Read: రాంచరణ్ ఇంట్లో దీపావళి సంబరాలు.. హాజరైన మహేష్, ఎన్టీఆర్, వెంకటేష్..