Bigg Boss 7 Telugu: నీ నిజస్వరూపం ఇదే.! నువ్వు మోసపోలే.. నీ చేతిలో నేను మోసపోయా..!

బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమోలో ఇంటి సభ్యులంతా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ ప్రోమోలో ప్రశాంత్, అమర్ ఇద్దరి మధ్య పెద్ద ఆర్గుమెంట్ జరిగింది. ఒకరి పై ఒకరు గట్టి గట్టిగా అరుచుకున్నారు.

New Update
Bigg Boss 7 Telugu:  నీ నిజస్వరూపం ఇదే.! నువ్వు మోసపోలే.. నీ చేతిలో నేను మోసపోయా..!

Bigg Boss 7 Nominations: బిగ్ బాస్ సీజన్ 7.. (Bigg Boss) ఇంట్లో నామినేషన్ రచ్చ మొదలయింది. తాజాగా నామినేషన్స్ ప్రోమో విడుదలైంది. నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి సభ్యులు ఒకరి పై ఒకరు తమ పాయింట్స్ చెబుతూ వాదించుకున్నారు. ఈ ప్రోమోలో ప్రశాంత్- అమర్, యావర్- అర్జున్ మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. ఒకరి పై ఒకరు గట్టి గట్టిగా అరుచుకున్నట్లుగా ప్రోమోలో కనిపించింది.

publive-image

ప్రశాంత్ VS అమర్

ప్రోమోలో ముందుగా అమర్ ప్రశాంత్ నామినేషన్ ప్రక్రియ మొదలైంది. అమర్ ప్రశాంత్ ను నామినేట్ చేస్తూ.. పల్లవి ప్రశాంత్ అమర్ కోసం మాట ఇచ్చాడు.. కానీ నిలబెట్టుకోలేదు అంటూ నామినేట్ చేశాడు. దానికి ప్రశాంత్.. నా మాట మీదనే ఉన్న.. నేను సపోర్ట్ చేశాను అని వాదించాడు. వీళ్లిద్దరి వాదనలో అమర్.. ప్రశాంత్ ను 'రా' అని అంటాడు. దాంతో ప్రశాంత్ 'నన్ను.. రా' అని పిలవకు అని ఫైర్ అయ్యాడు. ఇక అమర్ నేను నా తమ్ముడిని 'రా' అనే పిలుస్తా.. నీ ఇష్టం ఉంటే పలుకు లేదంటే మానేయ్ ప్రశాంత్ పై అరిచాడు.

ఆ తర్వాత ప్రశాంత్ వాదిస్తూ.. అందరిని మోసం చేసే గుణం నీది.. నువ్వు కాదు మోసపోయింది.. నీ చేతిలో నేను మోసపోయాను అంటూ అమర్ పై ఆరోపణలు చేశాడు. ఇక అమర్ కోపంతో ప్రశాంత్ పై రెచ్చిపోయాడు.

publive-image

పల్లవి ప్రశాంత్ సేఫ్ ప్లేయర్

ఇక శోభ, పల్లవి ఇద్దరి మధ్య కూడా వాదన జరిగింది. శోభ మాట్లాడుతూ.. మాట అంటే మాట.. మాట కోసం ప్రాణమైన ఇస్తాడు పల్లవి ప్రశాంత్ అని చెప్పావు కానీ ఏం చేయలేదు అని వాదించింది. ఇప్పుడు కాదు ఎప్పుడైనా చెప్తా సేఫ్ ప్లేయర్ ఎవరంటే పల్లవి ప్రశాంత్ అని కామెంట్ చేసింది.

publive-image

నీ వల్ల నేను నష్టపోయా

ఆ తర్వాత అర్జున్.. యావర్ గేమ్ ఆడిన తీరు పై నామినేట్ చేశాడు. నీ గేమ్ నువ్వు కరెక్ట్ గానే ఆడావు.. కానీ ఆ రోజు నువ్వు చేసిన తప్పుకు నేను లాస్ అయ్యానని చెప్పాడు అర్జున్. దానికి యావర్ నేను కావాలని చేయలేదు అంటూ వాదించాడు. ప్రోమో చివరిలో యావర్, అర్జున్ ఇద్దరు మధ్య పెద్ద ఆర్గుమెంట్ జరిగినట్లు కనిపించింది.

publive-image

Advertisment
తాజా కథనాలు