Bigg Boss 7 Telugu: గౌతమ్ ఎలిమినేటెడ్..? ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్..!

బిగ్ బాస్ సీజన్ 7.. వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యేదెవరనీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మంది సభ్యుల్లో శోభ, గౌతమ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నారు.

New Update
Bigg Boss 7 Telugu: గౌతమ్ ఎలిమినేటెడ్..? ఎవిక్షన్ ఫ్రీ పాస్ తో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ప్రశాంత్..!

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూసే ఎపిసోడ్స్ రెండు. ఒకటి నామినేషన్, మరోకటి ఎలిమినేషన్ ఎపిసోడ్. ఇక ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరని సోషల్ మీడియాల్ రకరకాల గాసిప్స్ వినిపిస్తున్నాయి. ప్రశాంత్, శివాజీ, యావర్, ప్రియాంక, శోభ, గౌతమ్, అర్జున్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. కేవలం అమర్ మాత్రమే ఈ వారం నామినేషన్ లో లేడు. ఈ వీక్ ఎలిమినేషన్ లిస్ట్ లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు శోభ, గౌతమ్.

publive-image

శోభ, గౌతమ్ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రశాంత్, శివాజీ, ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. సీజన్ మొదటి నుంచే గేమ్ చాలా బాగా ఆడుతూ ప్రేక్షకుల్లో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకున్నారు. ఇక ప్రియాంక ఈ వారం జరిగిన టికెట్ టూ ఫినాలే టాస్క్ లో సూపర్ గా పెర్ఫార్మ్ చేసింది. అంతే కాదు అమర్ కోసం తన పాయింట్స్ ఇవ్వమని గౌతమ్ ను రిక్వెస్ట్ చేయడం.. ఇవ్వనీ ప్రియాంక ఓటింగ్ పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు.

publive-image

ఇక అర్జున్ విషయానికి వస్తే.. ఈ వారం ఎవ్వరి సపోర్ట్ లేకుండా సొంతంగా ఆడి టికెట్ టూ ఫినాలే గెలవడంతో పాటు బిగ్ బాస్ సీజన్ 7 మొదటి ఫైనలిస్ట్ అయ్యాడు. ఈ వీక్ అర్జున్ పర్ఫామెన్స్ పీక్స్ అనే చెప్పొచ్చు. దీంతో అర్జున్ కు కూడా ఓటింగ్ బాగానే పడే అవకాశం ఉంది.

publive-image

ఈ వారం డేంజర్ జోన్ ఉన్నది శోభ, గౌతమ్, ఆ తర్వాత యావర్. రేసు టూ ఫినాలే టాస్క్ లో శోభ సెకండ్ రౌండ్ లోనే రేసు నుంచి ఔట్ అయ్యింది. దీంతో తన పర్ఫామెన్స్ కు అంతగా స్కోప్ దొరకలేదు. అందుకని శోభ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఒక వేల అమర్ నామినేషన్స్ లో లేనందున అమర్ (Amar) ఓట్స్ శోభకు పడితే.. శోభ (Shobha) ఎలిమినేషన్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. దీని వల్ల నెక్స్ట్ లీస్ట్ లో ఉన్న గౌతమ్ అవ్వచ్చని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ సీజన్ ఉల్టా పుల్టా అన్నట్లు ఊహించని విధంగా యావర్ ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వస్తే.. యావర్ కోసం ప్రశాంత్ (Pallavi Prashanth) ఎవిక్షన్ పాస్ వాడే అవకాశం ఉంది. కావున యావర్ కు ఎలిమినేషన్ భయం లేనట్లే.

Also Read: Bigg Boss 7 Telugu: అర్జున్ ఫస్ట్ ఫైనలిస్ట్ .. పాపం అమర్.. మళ్ళీ నిరాశే మిగిలింది..!

Advertisment
Advertisment
తాజా కథనాలు