Bigg Boss 7 Telugu: "ఇంకోసారి ఎవ్వరి మీద ఇలాంటి మాటలు చెప్పకు".. రతికకు అమర్ వార్నింగ్..!

బిగ్ బాస్ సీజన్ 7.. నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి యావర్, అర్జున్, ప్రియాంక, శోభ, అశ్విని, గౌతమ్, రతిక, అమర్ నామినేట్ అయ్యారు.

Bigg Boss 7 Telugu:  "ఇంకోసారి ఎవ్వరి మీద ఇలాంటి మాటలు చెప్పకు".. రతికకు అమర్ వార్నింగ్..!
New Update

Bigg Boss 7 Telugu:  బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ నిన్నటి ఎపిసోడ్ లో ఇంటి సభ్యులంతా నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియలో అర్జున్ , ప్రశాంత్.. యావర్, అమర్ ఇద్దరి మధ్య వాదనలు జరిగాయి. యావర్, అమర్ ఇద్దరి మధ్య గొడవకు కారణం రతిక.

publive-image

యావర్ Vs శోభ

ఈ నామినేషన్ ప్రక్రియలో యావర్ శోభను, శోభ యావర్ ను.. ఇద్దరు ఒకరిని ఒకరు నామినేట్ చేసుకున్నారు. ఈ ప్రక్రియలో వీళిద్దరి మధ్య వాదనలు జరిగాయి. యావర్ శోభను నామినేట్ చేస్తూ.. లాస్ట్ వీక్ నామినేషన్ ప్రక్రియలో రాజమాతలుగా.. మీరు కేవలం అమర్ కు మాత్రమే ఫేవర్ గా ఉన్నట్లు అనిపించిందని చెప్పాడు. దానికి శోభ.. 'మేము ఎవ్వరికి ఫేవర్ చేయలేదు అక్కడ.. ఎవరిది వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తే వాళ్ళను నామినేట్'  చేశామని వాదించింది.

publive-image

నువ్వు చేసేది రివెంజ్ నామినేషన్స్..

ఇక అర్జున్, ప్రశాంత్ ఇద్దరి మధ్య ఆర్గుమెంట్ కొనసాగుతూనే ఉంది. అర్జున్.. ప్రశాంత్ ను నామినేట్ చేస్తే.. తిరిగి అర్జున్ ను నామినేట్ చేశాడు ప్రశాంత్. దాంతో అర్జున్.. "నేను చెప్పిన పాయింట్ కరెక్ట్.. నువ్వు ఇప్పుడు చేసింది కూడా రివెంజ్ నామినేషనే.. ప్రతీ సారి నువ్వు రివెంజ్ నామినేషన్స్ వేస్తావు.. నీ సొంతగా ఎప్పుడు వేయలేదని" వాదించాడు. ఇక ప్రశాంత్ కూడా ఏ మాత్రం తగ్గలేదు.. "నేను రివెంజ్ నామినేషన్ వేయలేదు.. నువ్వు .. నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాను అన్నావు.. అది నాకు నచ్చలేదు అందుకే నామినేట్ చేస్తున్నానని"  తిరిగి వాదించాడు.

publive-image

ఇద్దరి మధ్య గొడవ పెట్టిన రతిక

అమర్, యావర్ ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. "రెండో వారం, మూడో వారం టాపిక్ పై.. ఇప్పుడు నామినేట్ చేస్తున్నావు.. ఇన్ని వారాలు ఎందుకు చేయలేదని" యావర్ తో ఆర్గుమెంట్ స్టార్ట్ చేశాడు అమర్. "అది కూడా.. నీకు రతిక చెప్తే.. నామినేట్ చేశావు నీ సొంతంగా కాదు.. అసలు నీ దగ్గర నామినేట్ చేయడానికి పాయింట్ లేదుని" చెప్పాడు అమర్. వీళ్లిద్దరి గొడవకు కారణమైన రతికతో.. అమర్ మాట్లాడుతూ .. మా ఇద్దరి మధ్య గొడవకు నువ్వు కూడా ఒక కారణం.. నేను చేయాలనుకుంటే.. నిన్నే నామినేట్ చేసేవాడిని.. కానీ నేను చేయను.. నాకు బుద్ది ఉంది.. నువ్వు ఒకసారి బయటకు వెళ్లి వచ్చావు .. ఇంకోసారి ఇలాంటి మాటలు చెప్పకు అని రతికకు బుద్ది చెప్పాడు.

publive-image

నామినేట్ అయిన సభ్యులు

ఈ వారం బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు యావర్, అర్జున్, ప్రియాంక, శోభ, అశ్విని, గౌతమ్, రతిక, అమర్. కెప్టెన్ శివాజీ, ప్రశాంత్ తప్ప మిగిలిన ఇంటి సభ్యులంతా నామినేషన్స్ లో ఉన్నారు.

publive-image

Also Read: Bigg Boss 7 Telugu: యావర్, అమర్ మధ్య గొడవ.. ఇద్దరికీ చిచ్చు పెట్టిన రతిక..!

#bigg-boss-7 #bigg-boss-7-latest-episode #bigg #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe