Bigg Boss 7 Telugu: యావర్, అమర్ మధ్య గొడవ.. ఇద్దరికీ చిచ్చు పెట్టిన రతిక..! బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి తాజాగా విడుదలైన ప్రోమోలో అమర్, యావర్ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వీళ్లిద్దరి మధ్య గొడవకు కారణం రతిక అన్నట్లుగా ప్రోమోలో కనిపించింది. By Archana 14 Nov 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ అంటేనే గొడవలు, ఆర్గుమెంట్స్ ఉంటాయి. ఇక వారం నామినేషన్ ప్రక్రియలో కూడా ఇంటి సభ్యుల మధ్య విపరీతమైన ఆర్గుమెంట్స్ జరిగాయి. ఈ సీజన్ అంతా ఉల్టా పుల్టా అన్నట్లుగానే సాగుతుంది. గత సీజన్స్ లో ఒక్క రోజుతో ముగిసే నామినేషన్స్.. ఈ సీజన్ లో రెండవ రోజు కూడా కంటిన్యూ అవుతున్నాయి. ప్రేక్షకులు కూడా ఈ నామినేషన్ ప్రక్రియ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఇక రోజు తాజాగా విడుదలైన ప్రోమోలో యావర్, అమర్ ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. ఈ నామినేషన్ ప్రక్రియలో అమర్, యావర్ మధ్య జరిగిన గొడవకు రతిక కారణం అన్నట్లుగా కనిపించింది. ఈ ప్రోమోలో అమర్ మాట్లాడుతూ.. "నువ్వు ఒకసారి బయటకు వెళ్లి వచ్చావు.. ఎవ్వరి మీద ఇలాంటి మాటలు చెప్పకు" అని అన్నాడు. అమర్ ఇలా అనడానికి కారణం.. అమర్ గురించి.. యావర్ తో.. రతిక చెప్పిన మాటలు. దాని వల్లే యావర్, అమర్ మధ్య గొడవ మొదలైంది. యావర్.. ఎప్పుడో మూడో, రెండో వారం జరిగిన విషయం గురించి అమర్ తో వాదించినట్లుగా కనిపింపించింది. దానికి అమర్.. "ఇక్కడ పూర్వాలు తవ్వుకుంటే.. ఒక్కొకరివి.. ఏమంత మహా గొప్ప జాతకాలు కాదులే" అని చెప్పాడు. "స్ప్రైట్ కోసం నామినేట్ చేశాడు యావర్" అని వాదించాడు అమర్. దానికి యావర్ ఆ స్ప్రైట్ విషయంలో నీ బిహేవియర్ కరెక్టా..? అని ప్రశ్నించాడు యావర్. "అమర్ రావాలి.. అమర్ పోవాలి.. ఇక్కడ చాలా మంది.. నన్ను బయటకు పంపాలని చూస్తున్నారని.. నాకు తెలుసు అని గట్టిగా అరిచాడు అమర్". వీళ్లిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఒకరి పై ఒకరి కోపంతో అరుచుకోవడం మొదలు పెట్టారు. కెప్టెన్ శివాజీ వీరిద్దరిని ఆపే ప్రయత్నం చేశాడు. ప్రోమో చివరిలో శివాజీ.. గౌతమ్ ను నామినేట్ చేశాడు. వీరిద్దరి మధ్య జరిగిన వాదనలో.. "బిగ్ బాస్ లో ఎమోషన్స్ అంటే.. లూస్ మోషన్ లాంటిది.. ఫ్లోలో వస్తుందని డైలాగ్ వేశాడు గౌతమ్. దాన్నే ఆపుకోవాలను కౌంటర్ ఇచ్చాడు శివాజీ. Also Read: Bigg Boss 7 Telugu: “నేను ఎవరో తెలియకపోతే గూగుల్ ను అడుగు”.. ప్రశాంత్ పంచ్ డైలాగ్..! #bigg-boss-7 #bigg-boss-7-latest-episode #bigg-boss-7-telugu #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి