Bigg Boss 7 Telugu: కింద పడితే ఔట్..! ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం వచ్చిన తిప్పలు.. బిగ్ బాస్ సీజన్ 7.. తాజాగా బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' గెలుచుకోవడానికి మరో అవకాశం ఇచ్చారు. ఈ టాస్క్ లో ఇంటి సభ్యులంతా పాల్గొన్నారు. By Archana 21 Nov 2023 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7.. బిగ్ బాస్ ఇంట్లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా హౌస్ మేట్స్ మధ్య వాదనలు జరిగాయి. ఈ నామినేషన్ ప్రక్రియలో యావర్ - అమర్, ప్రశాంత్ - గౌతమ్ మధ్య పెద్ద గొడవ జరిగింది. ఈ వారం ఇంటి సభ్యులు లాస్ట్ వీక్ జరిగిన 'ఎవిక్షన్ ఫ్రీ పాస్', 'కెప్టెన్సీ టాస్క్' లో అంశాలను దృష్టిలో ఉంచుకొని నామినేట్ చేసినట్లుగా కనిపించింది. ఇక ఈ రోజు తాజాగా బిగ్ బాస్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో బిగ్ బాస్ ఇంటి సభ్యులకు.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకోవడానికి మరో అవకాశం ఇస్తున్నానని తెలిపారు. గత వారంలో జరిగిన 'ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ లో.. యావర్ గెలిచి 'ఎవిక్షన్ పాస్' సొంతం చేసుకున్నాడు. కానీ యావర్ ఫౌల్ గేమ్ ఆడినందున వీకెండ్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ దాన్ని తిరిగి తీసుకున్నారు. ఇక ఈరోజు ప్రోమోలో ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలవడానికి మరో అవకాశం కల్పించారు బిగ్ బాస్. 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' పొందడానికి బిగ్ బాస్ ఇంటి సభ్యులకు ఒక టాస్క్ ఇచ్చారు. దీంట్లో ఇంటి సభ్యులంతా ఒకే సారి పాల్గొన్నారు. ఈ టాస్క్ లో బిగ్ బాస్ డిఫరెంట్ ఆకారాలలో ఉన్న కప్స్, ప్లేట్స్, గ్లాసెస్ ఇచ్చారు. వీటిని ఒక పెడస్టాల్ పై.. బిగ్ బాస్ చెప్పే క్రమంలో పెడుతూ బ్యాలన్స్ చేయాలనీ.. చివరి వరకు కింద పడకుండా.. బ్యాలన్స్ చేసిన వారు విజేతలని తెలిపారు. ఈ గేమ్ చాలా ఆసక్తిగా ఉండబోతున్నట్లుగా కనిపించింది. ప్రోమోలో చూపిన ప్రకారం.. ముందుగా శోభ, శివాజీ, యావర్, రతిక, అర్జున్ పడేసినట్లుగా కనిపించింది. ప్రశాంత్, ప్రియాంక ఇద్దరు అలాగే బ్యాలన్స్ చేస్తూ కనిపించారు. Also Read: Bigg Boss 7 Telugu: అన్నా, జర ఆగురాదే.. నువ్వెవరయ్యా.. నాకు చెప్పడానికి..! #bigg-boss #bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-telugu-latest-updates #bigg-boss-7-promo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి