Bigg Boss 7 Telugu: టైటిల్ రేసులో ముగ్గురు.. విజేత మాత్రం అతడే..?

బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు దశకు వచ్చేసింది. సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో.. విన్నర్ ఎవరనే దాని పై ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. శివాజీ, అమర్, ప్రశాంత్ మధ్య టైటిల్ పోరు సాగుతుంది. ఇక సోషల్ మీడియాలో శివాజీ విన్నర్, ప్రశాంత్ రన్నర్, అంటూ వార్తలు వైరలవుతున్నాయి.

New Update
Bigg Boss 7 Telugu: టైటిల్ రేసులో ముగ్గురు..  విజేత మాత్రం అతడే..?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 స్టార్ అయిన మొదటి వారం నుంచి షో ప్రేక్షకులకు ఆసక్తిగా ఉండేలా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీమ్. గత 6 సీజన్స్ తో పోలిస్తే సీజన్ 7 బిన్నంగా ఉందనే చెప్పాలి. ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికి ఉల్టా పుల్టా అనే కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేశారు మేకర్స్. ఎన్నో ట్విస్టులతో 14 వారల పాటు సాగిన బిగ్ బాస్ సీజన్ 7 ముగింపు దశకు చేరుకుంది. విజేతను ప్రకటించడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది.

ఇప్పటివరకు జరిగిన ప్రతీ సీజన్ లో ఐదుగురు మాత్రమే ఫైనలిస్టులు గా ఉండేవారు. కానీ సీజన్ 7 లో ఆరుగురు సభ్యులను ఫైనలిస్టులు గా అనౌన్స్ చేశారు బిగ్ బాస్. అమర్, అర్జున్, శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్ ఫైనల్స్ కు చేరుకున్నారు. సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో.. విన్నర్ ఎవరనే దాని పై ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ కు సంబంధించి సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ నడుస్తోంది.

publive-image

ఈ సీజన్ విన్నర్ ను ప్రకటించే విషయంలో కూడా బిన్నంగా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీమ్. ప్రతీ బిగ్ బాస్ సీజన్ లో ఫైనల్ వీక్ నమోదైన ఓట్ల ప్రకారం విన్నర్ ని ప్రకటించేవారు. కానీ సీజన్ 7 లో మాత్రం 14, 15 రెండు వారాల్లో పోలైన ఓట్ల ఆధారంగా విన్నర్ ను అనౌన్స్ చేయనున్నట్లు తెలిపారు. ఈ రెండు వారల పాటు ఓటింగ్ కూడా జోరుగా సాగింది.

గత సీజన్స్ లో గేమ్ చివరి దశకు వచ్చే సరికి విన్నర్ ఎవరనే విషయం పై ఒక అంచనా వచ్చేస్తుంది ప్రేక్షకుల్లో. కానీ సీజన్ 7 లో శివాజీ, అమర్, ప్రశాంత్ మధ్య పోటీ గట్టిగా సాగుతుంది. ముగ్గురిలో కొన్ని ఆన్లైన్ పూల్స్ లో శివాజీ విన్నర్, ప్రశాంత్ రన్నర్ గా ఉన్నాయి. మరి కొన్నింటిలో ప్రశాంత్ విన్నర్, శివాజీ రన్నర్, అమర్ 3 స్థానంలో ఉన్నట్లు సోషల్ మీడియాలో బజ్ నడుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ గెలిచేదెవరో ఆదివారం ఫినాలే ఎపిసోడ్ లో తేలిపోతుంది.

Bigg Boss 7 Telugu: ఫినాలేకు ముందే 10 లక్షల ఆఫర్.. శివాజీ చేతిలో సూట్ కేస్..! - Rtvlive.com

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు