Bigg Boss 7 Telugu: ఫినాలేకు ముందే 10 లక్షల ఆఫర్.. శివాజీ చేతిలో సూట్ కేస్..! బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు వచ్చేసింది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు ఒక్క రోజు మాత్రమే ఉంది. తాజాగా బిగ్ బాస్ ఈరోజు ప్రోమో విడుదల చేశారు. ప్రోమోలో బిగ్ బాస్ ఫినాలేకు ముందే ఇంటి సభ్యులకు 10 లక్షల ఆఫర్ ఇచ్చారు. ఇంటి సభ్యులకు షాకిచ్చారు. By Archana 16 Dec 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Bigg Boss 7 Telugu: ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో మొదలైన బిగ్ బాస్ సీజన్ 7 రియాలిటీ షో ఫైనల్ లెవెల్ కు చేరుకుంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు కేవలం ఒక్క రోజు మాత్రమే మిగిలింది. 14 వారల పాటు కష్టపడి గేమ్స్ ఆడిన ఇంటి సభ్యులు చివరి వారం కాస్త చిల్ అవుతున్నారు. ఇక ఈరోజు బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఇంటి సభ్యులు ఎంజాయ్ చేయడానికి బిగ్ బాస్ ఫన్నీ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో అమర్, శివాజీ, ప్రశాంత్ కామెడీ చేస్తూ అందరినీ నవ్వించారు. ఇంట్రెస్టింగ్ గా మారింది. గత సీజన్స్ ఎప్పుడు లేని విధంగా గ్రాండ్ ఫినాలేకు ముందే బిగ్ బాస్ 10 లక్షలు ఉన్న సూట్ కేస్ హౌస్ లోకి పంపి ఇంటి సభ్యులకు షాకిచ్చారు. 10 లక్షల సూట్ కేస్ ముందు పెట్టి.. "దీన్ని ఎవరు తీసుకోవాలని అనుకుంటున్నారో తెలపాలని అడిగారు". ఇంటి సభ్యులంతా సూట్ చేతిలో పట్టుకొని ఆలోచిస్తూ కనిపించారు ప్రోమోలో. సాధారణంగా ప్రతీ సీజన్ లో గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై ఈ ఆఫర్ అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్. టాప్ 3 కంటెస్టెంట్స్ ఉన్నప్పుడు.. ఆఫర్ చేసిన మనీ తీసుకొని..నేరుగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఇస్తారు. కానీ ఈ సీజన్ ఉల్టా పుల్టా అన్నట్లుగానే గ్రాండ్ ఫినాలేకు ఒకరోజు ముందే ఇంటి సభ్యులకు 10 లక్షల ఆఫర్ ఇచ్చారు బిగ్ బాస్. మరి ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇచ్చిన 10 లక్షల ఆఫర్ తీసుకొని.. ఎవరైన వెళ్ళిపోతారా..? లేదా ఫినాలే రిజల్ట్స్ కోసం వైట్ చేస్తారా అనేది చూడాలి. Bigg Boss 7 Grand Finale: బిగ్‌బాస్ ఫైనల్‌కు ప్రిన్స్ మహేశ్..! గెస్ట్‌గా మరో హీరో కూడా.. ఎవరంటే? - Rtvlive.com #bigg-boss-7-telugu #bigg-boss-7 #bigg-boss-7-promo #bigg-boss-7-telugu-latest-updates మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి