Pallavi Prashanth: రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఆదివారం ముగిసింది. విజేతను ప్రకటించిన అనంతరం అన్నపూర్ణ స్థూడియో ఎదుట ఘర్షణ చోటు చేసుకుంది. ప్రశాంత్, అమర్ దీప్ ఇరువర్గాల ఫ్యాన్స్ ఒకరి పై ఒకరు దాడులు చేసుకున్నారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్, ఇంకా మిగతా కంటెస్టెంట్స్ కార్లు, అలాగే ప్రభుత్వ బస్సుల పై దాడి చేసి ప్రభుత్వ ఆస్తులను ధ్వంశం చేశారు. ఈ ఘటనకు కారణమైన పల్లవి ప్రశాంత్, అతని అభిమానుల పై పోలీసులు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం పల్లవి ప్రశాంత్, అతని సోదరుడిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ తర్వాత పోలీసులు ప్రశాంత్ ను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. విచారణ తర్వాత నాంపల్లి కోర్టు ప్రశాంత్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
తాజాగా ప్రశాంత్ బెయిల్ పీటీషన్ పై నాంపల్లి కోర్టు షాకిచ్చింది. పల్లవి ప్రశాంత్ తరపు న్యాయవాది జూలకంటి వేణుగోపాల్ ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేయాలనీ కోర్టులో తమ వాదనలు వినిపించారు. బిగ్ బాస్ ఇంట్లో 105 రోజుల పాటు ఉన్న ప్రశాంత్ కు బయట జరిగిన విషయాల గురించి తెలియదని.. ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేయాలనీ కోరారు. భద్రత, బందోబస్త్ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని ప్రశాంత్ తరుపున న్యాయవాది కోర్టులో వాదించారు. వాదనలను పూర్తిగా విన్న నాంపల్లి కోర్టు ప్రశాంత్ బెయిల్ పిటీషన్ తీర్పు రేపటికి వాయిదా వేసింది. బిగ్ బాస్ నిర్వాహకులు పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా పోలీసులు భద్రత కల్పించడంలో ఫెయిల్ అయ్యారని న్యాయవాదులు వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరో వాదన కూడా వినిపిస్తుంది. స్థూడియో దగ్గర పరిస్థితిని గమనించిన పోలీసులు ప్రశాంత్ ను హెచ్చరించినప్పటికీ.. వినకుండా ర్యాలీ చేశారని చెబుతున్నారు. దీని వల్లే పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: pallavi prashanth: ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో మరో 16 మంది అరెస్ట్..!
Also Read: pallavi prashanth: ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో మరో 16 మంది అరెస్ట్..!