pallavi prashanth: ఆదివారం ముగిసిన గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో బిగ్ బాస్ సీజన్ 7 విజేతను ప్రకటించిన అంతరం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియో ముందు వీరంగం సృష్టించారు. కంటెస్టెంట్స్ కార్ల పై రాళ్లు విసురుతూ దాడి చేశారు. అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సుల పై దాడి చేసి ప్రభుత్వ ఆస్తులను ధ్వంశం చేశారు. ఈ ఘటనకు కారణమైన పల్లవి ప్రశాంత్, అతని అభిమానుల పై పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు రోజుల తర్వాత పోలీసులు పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. నాంపల్లి కోర్టులో విచారణ జరిపిన అనంతరం ప్రశాంత్ కు కోర్ట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించి చెంచల్ గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..pallavi prashanth: ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో మరో 16 మంది అరెస్ట్..!
బిగ్ బాస్ విజేతను ప్రకటించిన అనంతరం అన్నపూర్ణ స్థూడియో దగ్గర జరిగిన గొడవ కేసులో పోలీసులు మరో 16 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 12 మంది మేజర్లు, నలుగురు మైనర్లు ఉన్నట్లుగా తెలిపారు. నిందితులను జూబ్లీహిల్స్ పోలీసులు కోర్టులో హాజరు పరచనున్నారు.
Translate this News: