Case Filed On Actor Raj Tarun : రాజ్ తరుణ్ లవ్ కేసుఊహించని మలుపు తిరిగింది. లావణ్య ఇచ్చిన పోలీసు కంప్లెయింట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాని ప్రకారం.. 2014లో గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్‌లో రాజ్ తరుణ్ లావాన్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన రెండో నెలలోనే లావణ్యకు అబార్షన్ చేయించాడు. మళ్ళీ 2016 లో మరోసారి అబార్షన్ చేయించాడు. అంతేకాదు రాజ్‌తరుణ్‌కు తాను 70 లక్షలు ఇచ్చానని, అతని దగ్గర దా దాపు 30 కుక్కలు ఉన్నాయని, ఆ కుక్కల వల్ల 6 ఇళ్లు మారాల్సి వచ్చిందని.. ఇలా ప్రతి చిన్న విషయాన్ని లావణ్య ఫిర్యాదులో రాసుకొచ్చింది.
అలాగే గతంలో రాజ్ తరుణ్ తనకు చేయించిన అబార్షన్ మెడికల్ డాక్యుమెంట్స్ ను పోలీసులకు అందజేసింది. దీంతో రాజ్‌తరుణ్‌పై 420, 506, 493 సెక్షన్ల కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 493 నమోదుతో రాజ్‌తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. అది నాన్‌బెయిలబుల్ సెక్షన్ కావడంతో అరెస్ట్ చేసే చాన్స్ ఉంటుంది. మోసపూరిత పెళ్లి కింద పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు రాజ్ తరుణ్ తో పాటూ ఇందులో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడిపైనా కేసు నమోదయింది. A1గా రాజ్‌తరుణ్, A2గా మాల్వి మల్హోత్రా, A3గా మయాంక్ మల్హోత్రాపై కేసు ఫైల్ చేసినట్లు సమాచారం.