Raj Tarun : లావణ్య, రాజ్ తరుణ్ కేసులో బిగ్ ట్విస్ట్.. రాజ్ తరుణ్ కు పదేళ్ల జైలు శిక్ష? రాజ్ తరుణ్ పై లావణ్య ఇచ్చిన కంప్లెయింట్‌లో సంచలన విషయాలు బయటికొచ్చాయి. . 2014లో రాజ్ తరుణ్ లావణ్యను పెళ్లి చేసుకొని రెండో నెలకే అబార్షన్ చేయించాడని లావణ్య పేర్కొంది.. దీంతో రాజ్‌తరుణ్‌పై 420, 506, 493 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. By Anil Kumar 11 Jul 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Case Filed On Actor Raj Tarun : రాజ్ తరుణ్ లవ్ కేసుఊహించని మలుపు తిరిగింది. లావణ్య ఇచ్చిన పోలీసు కంప్లెయింట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాని ప్రకారం.. 2014లో గచ్చిబౌలి ఎల్లమ్మ టెంపుల్‌లో రాజ్ తరుణ్ లావాన్యను పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన రెండో నెలలోనే లావణ్యకు అబార్షన్ చేయించాడు. మళ్ళీ 2016 లో మరోసారి అబార్షన్ చేయించాడు. అంతేకాదు రాజ్‌తరుణ్‌కు తాను 70 లక్షలు ఇచ్చానని, అతని దగ్గర దా దాపు 30 కుక్కలు ఉన్నాయని, ఆ కుక్కల వల్ల 6 ఇళ్లు మారాల్సి వచ్చిందని.. ఇలా ప్రతి చిన్న విషయాన్ని లావణ్య ఫిర్యాదులో రాసుకొచ్చింది. Also Read : కీ బోర్డ్ ప్లేయర్ నుంచి టాప్ మ్యూజిక్ డైరెక్టర్డ్ గా.. మెలోడీ బ్రహ్మ ఎవర్ గ్రీన్ జర్నీ ఇదే! అలాగే గతంలో రాజ్ తరుణ్ తనకు చేయించిన అబార్షన్ మెడికల్ డాక్యుమెంట్స్ ను పోలీసులకు అందజేసింది. దీంతో రాజ్‌తరుణ్‌పై 420, 506, 493 సెక్షన్ల కింద నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 493 నమోదుతో రాజ్‌తరుణ్ చిక్కుల్లో పడ్డాడు. అది నాన్‌బెయిలబుల్ సెక్షన్ కావడంతో అరెస్ట్ చేసే చాన్స్ ఉంటుంది. మోసపూరిత పెళ్లి కింద పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు రాజ్ తరుణ్ తో పాటూ ఇందులో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడిపైనా కేసు నమోదయింది. A1గా రాజ్‌తరుణ్, A2గా మాల్వి మల్హోత్రా, A3గా మయాంక్ మల్హోత్రాపై కేసు ఫైల్ చేసినట్లు సమాచారం. #lavanya #actor-raj-tarun-case మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి