Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు ఊహించని ట్విస్ట్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణ జరుపుతున్న జడ్జి బదిలీ అయ్యారు. ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక ఆదేశాలు ఇచ్చారు జస్టిస్ నాగ్ పాల్. ఆయన స్థానంలో జస్టిస్ కావేరి బవేజా నియమితులయ్యారు.

New Update
Delhi Liquor Scam: ఎమ్మెల్సీ కవితకు ఊహించని ట్విస్ట్

Rouse Court Judge MK Nagpal Transferred: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ జరుపుతున్న జడ్జి నాగ్ పాల్ అనూహ్యంగా బదిలీ అయ్యారు. ఇప్పటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక ఆదేశాలు ఇచ్చారు జస్టిస్ నాగ్ పాల్. ప్రస్తుతం ఆయన స్థానంలో జస్టిస్ కావేరి బవేజా నియమితులయ్యారు. ఎమ్మెల్సీ కవిత కేసు (MLC Kavitha Liquor Scam) విచారణ జరుగుతున్న రోజు జడ్జ్ జస్టిస్ నాగ్ పాల్ అనూహ్యంగా బదిలీ కావటం చర్చనీయాంశమైంది. అలాగే ఢిల్లీ హైకోర్టు జ్యూడిషియల్ సర్వీసెస్ లోని మరో 26 మంది జడ్జీలు బదిలీ అయ్యారు.

ALSO READ: ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్

కవిత విజ్ఞప్తికి ఓకే..

లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఏడూ రోజుల ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవిత రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసింది. తన కొడుకు, తల్లిని కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కవితకు అనుమతినిచ్చింది కోర్టు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతినిచ్చింది. ఇక శనివారం రోజు మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావు కవితను కలిసిన విషయం తెలిసిందే.

సుప్రీంలో మరోసారి పిటిషన్..
సుప్రీం కోర్టులో ఎమ్మెల్సీ కవిత రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ రిమాండ్ ను రద్దు చేయాలని పిటిషన్ లో కవిత తరఫున లాయర్లు కోరారు. ఈడీ కస్టడీ నుంచి కవితను తప్పించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవితను మాజీ మంత్రి కేటీఆర్, అడ్వకేట్ వెళ్లి కలిశారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై ఏడు రోజులు ఈడీ కస్టడీలో కవిత ఉన్న విషయం తెలిసిందే.
Advertisment
తాజా కథనాలు