Armoor Ex MLA : ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి(Jeevan Reddy) కి ఆర్టీసీ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. ఆర్మూర్ బస్ స్టేషన్ సమీపంలో జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్(Jeevan Reddy Mall & Multiplex) భవనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనిని 2013లో ఆర్టీసీ సంస్థ నుంచి విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ 33 సంవత్సరాల లీజుకు తీసుకుంది. 2017లో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా కంపెనీని జీవన్ రెడ్డి సతీమణి రజితా రెడ్డి టేకోవర్ చేసుకుంది. షాపింగ్‌మాల్‌కు జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్‌గా పేరు మార్పు చేశారు. అయితే.. ఒప్పందం ప్రకారం సకాలంలో అద్దె చెల్లించలేదని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.
గతేడాది అక్టోబర్ నాటికి రూ. 8.65 కోట్ల బకాయి ఉందని వారు అంటున్నారు. నోటీసులు ఇవ్వడంతో అదే నెలలో రూ.1.50 కోట్లు చెల్లించారని చెబుతున్నారు. షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో డిసెంబర్ విడతల వారీగా మరో రూ.2.40 కోట్లు చెల్లించారని ఆర్టీసీ(RTC) చెబుతోంది. ఈ షోకాజ్ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు జీవన్ రెడ్డి. బకాయిలు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : వివాహేతర సంబధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపించిన భార్య
జనవరి, ఫిబ్రవరిలో విడతల వారీగా రూ.2 కోట్లు చెల్లించారు. నెల రోజుల్లో మిగిలిన బకాయిలు చెల్లించాలని మార్చి 27న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నెల రోజుల గడువు పూర్తయినా బకాయిలను జీవన్ రెడ్డి చెల్లించలేదు. దీంతో రూ.2.51 కోట్ల అద్దె పెండింగ్ లో ఉంది. బకాయిల కోసం గత ఐదేళ్లుగా 20కి పైగా నోటీసులు జారీ చేసింది. నిబంధనల ప్రకారం విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌కు టర్మినేషన్ ఆర్డర్ జారీ చేసిన ఆర్టీసీ.. తాజాగా బిల్డింగ్ ను స్వాధీనం చేసుకుంది.