Breaking: మెట్రోరైలు ప్రయాణికులకు బిగ్‌ షాక్‌.. ఇకపై అవి ఉండవు

భాగ్యనగర ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో బిగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ అధికారులు ప్రయాణికులకు ఇచ్చే రాయితీలను రద్దు చేశారు. రూ. 59 హాలిడే కార్డును కూడా రద్దు చేసినట్లు తెలిపారు.

New Update
Breaking: మెట్రోరైలు ప్రయాణికులకు బిగ్‌ షాక్‌.. ఇకపై అవి ఉండవు

Hyderabad Metro: భాగ్యనగర ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో పెద్ద షాక్ ఇచ్చింది. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ అధికారులు ప్రయాణికులకు ఇచ్చే రాయితీలను రద్దు చేశారు. రూ. 59 హాలిడే కార్డును కూడా రద్దు చేసినట్లు తెలిపారు. ఈ మెట్రో రైల్‌ అధికారుల నిర్ణయంతో వేసవిలో కూల్ జర్నీ చేద్దామనకున్న ప్రయాణికులకు ఊహించని షాక్ తగిలినట్లయ్యింది. ప్రయాణికుల రద్దీ కారణంగా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. సెలవు దినాల్లో రూ.59తో రోజంతా ప్రయాణించే విధంగా ఉన్న హాలిడే కార్డును పూర్తిగా రద్దు చేసింది హైదరాబాద్‌ మెట్రో.

publive-image

హైదరాబాద్‌ మెట్రోలో సెలవు దినాల్లో ఎంచక్కా తిరగాలనుకుంటే ఇకపై కుదరదు. ప్రయాణికులకు వర్తించే రాయితీలను అధికారులు రద్దు చేశారు. 59 రూపాయల హాలిడేకార్డును సైతం రద్దు చేశారు. ఈ నిర్ణయంతో ఎండాకాలంలో చల్లగా ఏసీలో ప్రయాణిద్దామనుకునేవారు కంగుతిన్నారు. మామూలు రోజుల్లో అయితే మెట్రో కార్డు కొనుగోలు చేస్తే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.. మళ్లీ రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి వరకు 10 శాతం రాయితీ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు అది ఎత్తివేశారు.

publive-image

ఎండల కారణంగా మెట్రో రైలుకు డిమాండ్ పెరగడంతో ఈ రాయితీలు రద్దు చేస్తూ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై మెట్రో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో జేబులకు చిల్లుపడటం ఖాయమని ఆందోళన చెందుతున్నారు. మళ్లీ రాయితీలు కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి:బ్రిటన్‌ ప్రధాని బ్యాటింగ్‌కు ఫిదా అయిన క్రికెటర్లు

Advertisment
Advertisment
తాజా కథనాలు