Vemireddy Prabhakar Reddy: అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో జరగనున్న సీఎం జగన్ ను బిగ్ షాక్ తగిలింది. వైసీపీలో రాజీనామాల పర్వానికి ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. తాజాగా మరో నేత వైసీపీ కి రాజీనామా చేశారు.ఆ పార్టీకి రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన్ను నెల్లూరు ఎంపీగా పోటీ చేయించాలని పార్టీ ఆలోచన చేసింది. అయినా కూడా ఆయన రాజీనామా చేయడం ఆ పార్టీలో చర్చనీయాంశమైంది.ఈ క్రమంలో తన రాజీనామా లేఖను పార్టీ అధినేత సీఎం జగన్‌కు పంపారు వేమిరెడ్డి. త్వరలో ఆయన టీడీపీలో చేరతారని ప్రచారం జరుగుతోంది.
ALSO READ: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్
వ్యక్తిగత కారణాలే..
వ్యక్తి గత కారణాల వల్లే తాను తన రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. "నేను, నా వ్యక్తిగత కారణాల వలన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి మరియు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేయుచున్నాను. నా రాజీనామాను తక్షణమే ఆమోదించవలసినదిగా కోరుచున్నాను. ఈ సందర్భంగా మీరు నాకు పార్టీలో అందజేసిన సహకారానికి నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను." అని తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
టీడీపీలోకి ఆహ్వానించాం: సోమిరెడ్డి
వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ను టీడీపీలో చేరమని ఆహ్వానించినట్లు పేర్కొన్నారు ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. వేమిరెడ్డి దంపతులు వైసీపీకి రాజీనామా చేయడం ఏపీ రాజకీయాల్లో మంచి పరిణామం అని అన్నారు. వేమిరెడ్డి కుట్రలు, కుతంత్రాలు చేసే నేత కాదని తెలిపారు. వైసీపీలో ఇమడలేకే వేమిరెడ్డి బయటకు వచ్చారని వెల్లడించారు. అయితే.. వేమిరెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. సీట్ల కేటాయింపు విషయంపై ఇది వరకే చంద్రబాబుతో ఆయన రహస్య చర్చలు జరిపినట్లు రాష్ట్ర రాజకీయాల్లో టాక్ నడుస్తోంది. మరి వేమిరెడ్డి ఎప్పుడు టీడీపీలో చేరుతారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.