తెలంగాణలో 119 స్థానాల్లో పోటీ చేస్తున్న బీఎస్పీకి గట్టి షాకిచ్చింది ఎన్నికల సంఘం. 8మంది బీఎస్పీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. దీంతో 111 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వివిధ కారణాలతో 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు రిజక్ట్ చేశారు.
119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎస్పీ తన అభ్యర్థులను బరిలోకి దించింది. అయితే సోమవారం నామినేషన్ల పరిశీలన నేపథ్యంలో 8మంది అభ్యర్థుల నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. అందులో
1. స్టేషన్ ఘన్ పూర్,
2. పాలకుర్తి, భువనగిరి,
3. గోషామహల్,
4.మధిర,
5.బహదూర్ పుర,
6.మిర్యాలగూడ,
7.ఆలేరు,
8. (తెలియాల్సి ఉంది )లలో నామినేషన్లు రిజక్ట్ చేశారు ఎన్నికల అధికారులు.
ఇక రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఎస్పీ ఒంటరిగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. బీఎస్పీ తెలంగాణ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ కాగజ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. లెఫ్ట్, బీఎస్పీతో కలిసి పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ భావించింది. కానీ సీపీఐ మాత్రమే కాంగ్రెస్ తో నడించేందుకు సిద్ధమైంది. సీపీఎం, బీఎస్పీ ఒంటరిగానే బరిలోకి దిగాయి. కాంగ్రెస్ కు తెలంగాణ జనసమితి సపోర్టు ఇచ్చింది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 118 స్థానాల్లో పోటీ చేస్తుంది. ఒక్క స్థానంలో సీపీఐకి ఇచ్చింది. సీపీఎం ఒంటరిగానే ప్రజల్లోకి వస్తోంది.
ఇది కూడా చదవండి: టార్గెట్ నకిరేకల్.. వేముల వీరేశం ఓటమికి కేసీఆర్ స్కెచ్ ఇదే!